
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. సమకాలీన సామాజిక అంశాల నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. రామ్‌చరణ్ గెస్ట్ రోల్ పరంగా వార్తల్లో నిలిచిన ఈ చిత్రం హీరోయిన్ త్రిష కరాణంగా టాక్ ఆప్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
సృజనాత్మక విభేధాల కారణంగా ఈ చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్టు త్రిష ప్రకటించింది. అయితే తమిళ చిత్రం `పొన్నియిన్ సెల్వన్` కారణణంగానే తన చిత్రం నుంచి త్రిష తప్పుకుందని మెగాస్టార్ వివరణ ఇచ్చారు. తరువాత అనుష్కని తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఆ స్థానంలో చివరికి కాజల్ అగర్వాల్ ని ఫైనల్ చేశారు.
తాజాగా కాజల్ కూడా ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. కారణం కాజల్ తమిళంలో `ఇండియన్ 2, హే సినామిక, హిందీలో `ముంబై సాగా`, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో `మోసగాళ్లు` చిత్రాల్లో నటిస్తోంది. కరోనా వైరస్.. లాక్‌డౌన్ కారణంగా డేట్స్ సమస్య తలెత్తే అవకాశం వుండటంతో కాజల్ `ఆచార్య` సినిమా నుంచి తప్పుకోవాలని భావిస్తోందని తాజాగా వినిపిస్తోంది.