Homeగాసిప్స్మరో కల్ట్ రీమేక్ కూడా శ్రీకాంత్ అడ్డాల చేతికే?

మరో కల్ట్ రీమేక్ కూడా శ్రీకాంత్ అడ్డాల చేతికే?

మరో కల్ట్ రీమేక్ కూడా శ్రీకాంత్ అడ్డాల చేతికే?
మరో కల్ట్ రీమేక్ కూడా శ్రీకాంత్ అడ్డాల చేతికే?

సెన్సిబుల్ దర్శకుడిగా చాలా తక్కువ సినిమాలతోనే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. అయితే ఒకే ఒక్క బ్యాడ్ సినిమా తన కెరీర్ ను తలకిందులు చేసేసింది. బ్రహ్మోత్సవం తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది ఈ దర్శకుడికి. మొత్తానికి సురేష్ ప్రొడక్షన్స్ వారు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. తమిళంలో కల్ట్ క్లాసిక్ గా పేరొంది నేషనల్ అవార్డును సైతం గెలుచుకున్న అసురన్ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా రీమేక్ చేసాడు.

ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు ఇలాంటి ఒక రా కాన్సెప్ట్ ను ఎలా హ్యాండిల్ చేశాడా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అసురన్ రీమేక్ ను శ్రీకాంత్ అడ్డాల బాగానే హ్యాండిల్ చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం శ్రీకాంత్ అడ్డాల చేతికి మరో రీమేక్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే ప్రైమ్ లో విడుదలై సంచలనం సృష్టించిన కర్ణన్ చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ చేయాలని అనుకుంటున్నాడు. అసురన్ రీమేక్ ను హ్యాండిల్ చేసిన శ్రీకాంత్ అడ్డాల అయితే బెటర్ ఏమో అని ఆలోచిస్తున్నాడు. చూడాలి మరి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All