Homeటాప్ స్టోరీస్శ్రీదేవి సోడా సెంటర్ మూవీ రివ్యూ

శ్రీదేవి సోడా సెంటర్ మూవీ రివ్యూ

శ్రీదేవి సోడా సెంటర్ మూవీ రివ్యూ
శ్రీదేవి సోడా సెంటర్ మూవీ రివ్యూ

నటీనటులు: సుధీర్ బాబు, ఆనంది, ప‌వెల్ న‌వ‌గీత‌మ్‌, న‌రేష్‌, ర‌ఘుబాబు మరియు ఇతరులు
దర్శకుడు: కరుణ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
సంగీత దర్శకుడు: మణిశర్మ
రేటింగ్: 3/5

సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస ఫేమ్ కరుణ కుమార్ నటించిన శ్రీదేవి సోడా సెంటర్ ఈరోజు విడుదలైంది. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాకు ముందు నుండీ మంచి బజ్ ఉంది. మరి ఈ బజ్ సినిమాకు తగ్గట్లుగానే ఉందో లేదో చూద్దాం.

- Advertisement -

కథ:
సూరి బాబు (సుధీర్ బాబు) ఒక లైట్ మ్యాన్. తనకు సొంతంగా షాప్ పెట్టుకోవాలని ఆశిస్తాడు. అలాగే అదే ఊర్లో ఉండే శ్రీదేవి (ఆనంది)ని ఇష్టపడతాడు. శ్రీదేవి కుటుంబానిది సోడాల వ్యాపారం. అయితే సూరిబాబుతో శ్రీదేవి వివాహానికి తన తండ్రి (నరేష్) ఒప్పుకోడు. తనది కులం తక్కువ అనే కారణంతో వద్దంటాడు. ఆ తర్వాత సూరి బాబును ఒక మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు.

ఆ తర్వాత ఏం జరిగింది? సూరి బాబు జైలు నుండి వచ్చాడా? వచ్చాక ఎదురైన పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటులు:
సుధీర్ బాబు ఈ చిత్రంలో బెస్ట్ ఔట్పుట్ ఇచ్చాడు. తన బాడీ అదిరింది. అలాగే ఎమోషనల్ సీన్స్ లో, యాక్షన్ సన్నివేశాలలో చాలా బాగా రాణించాడు సుధీర్ బాబు. ముఖ్యంగా బోట్ రేసింగ్ ఎపిసోడ్ లో సుధీర్ అదరగొట్టాడు. ఆనందికి మంచి సినిమా పడింది. శ్రీదేవిగా జీవించేసింది ఆనంది. విలన్ గా నటించిన పావెల్ నవగీతన్ కూడా మెప్పిస్తాడు. నరేష్ కు మరోసారి మంచి పాత్ర పడింది. సత్యం రాజేష్, రఘు బాబు ఓకే.

సాంకేతిక నిపుణులు:
మణిశర్మ నేపధ్య సంగీతం చిత్రానికి మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది. చాలా సన్నివేశాలను మరో లెవెల్ కు తీసుకెళ్లాడు మణిశర్మ. డైలాగ్స్ బాగున్నాయి. యాక్షన్ సన్నివేశాలు మెప్పిస్తాయి. బోట్ రేసింగ్ ఎపిసోడ్ సినిమాకు మరో హైలైట్. అయితే కథనం కొంత నెమ్మదించడం సినిమాకు మైనస్. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కొంత షాకింగ్ అని చెప్పవచ్చు. రన్ టైం ను కొంత తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది.

చివరిగా:
శ్రీదేవి సోడా సెంటర్ నెమ్మదిగా సాగే విలేజ్ బ్యాక్ డ్రాప్ రస్టిక్ యాక్షన్ డ్రామా. పరువు హత్యల నేపథ్యంలో సాగి చివర్లో షాకింగ్ గా ముగుస్తుంది. నటీనటుల పెర్ఫార్మన్స్, సాంకేతిక నిపుణుల పనితనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. ముఖ్యంగా చివర్లో వచ్చే సన్నివేశాలు చిత్రానికి బలంగా నిలిచి వన్ టైమ్ వాచ్ గా మారుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All