Tuesday, September 27, 2022
Homeటాప్ స్టోరీస్శ్రీదేవి సోడా సెంటర్ ఓపెన్ అయ్యేది ఆరోజే!

శ్రీదేవి సోడా సెంటర్ ఓపెన్ అయ్యేది ఆరోజే!

శ్రీదేవి సోడా సెంటర్ ఓపెన్ అయ్యేది ఆరోజే!
శ్రీదేవి సోడా సెంటర్ ఓపెన్ అయ్యేది ఆరోజే!

సుధీర్ బాబు మరోసారి ఎంటర్టైనింగ్ పాత్రలోకి షిఫ్ట్ అయ్యాడు. మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ కలిసి ఉండే పాత్రను చేస్తున్నాడు శ్రీదేవి సోడా సెంటర్ చిత్రంలో. పలాస ఫేమ్ కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్ లో యమ బిజీగా ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విడుదల తేదీ ఖరారైంది.

- Advertisement -

శ్రీదేవి సోడా సెంటర్ ను అధికారికంగా ఆగస్ట్ 27న విడుదల చేస్తున్నట్లు సుధీర్ బాబు ప్రకటించాడు. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేసాడు. ఎస్ఆర్ కళ్యాణమండపం సాధించిన విజయంతో సినీ నిర్మాతల్లో ధైర్యం పెరిగింది. దీంతో చాలా మంది తమ సినిమాలను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే టీజర్, మొదటి సాంగ్ తో ఇంప్రెస్ చేసిన శ్రీదేవి సోడా సెంటర్ యూనిట్ సినిమా పరంగా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Sridevi Soda Center  is directed by Karuna Kumar and is jointly bankrolled by Vijay Chilla and Shashi Devireddy under the banner of 70 mm Entertainments.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts