Homeటాప్ స్టోరీస్తొడకొట్టమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కోరుతున్న శ్రీ రెడ్డి

తొడకొట్టమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కోరుతున్న శ్రీ రెడ్డి

sri reddy tweets on ntr's aravinda sametha తొడకొట్టమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అడుగుతోంది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తొడకొట్టమని శ్రీ రెడ్డి కోరడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? అరవింద సమేత చిత్రం విడుదలై విజయవంతం అయిన నేపథ్యంలో ఉత్సాహంతో తొడకొట్టమని అంటోంది శ్రీ రెడ్డి . అంతేకాదు ఎన్టీఆర్ నిలువెత్తు కటౌట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి . అక్టోబర్ 11 న ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదల అయిన విషయం తెలిసిందే . కాగా ఆ సినిమాలో ఫ్యాక్షన్ వద్దని చెప్పడమే కాకుండా మహిళా సాధికారత గురించి చెప్పడంతో ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ కు జేజేలు పలుకుతోంది శ్రీ రెడ్డి .

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి ప్రభంజనం సృష్టించిన నటి శ్రీ రెడ్డి . కాగా ఆ సంఘటనల తర్వాత కొంత విరామం తీసుకున్న ఈ భామ తాజాగా టిఆర్ఎస్ ఎం ఎల్ ఏ జీవన్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేసింది . రాత్రికి నన్ను రమ్మన్నాడని , నేను నిరాకరించానని అందుకు అతడు బెదిరించాడని చెప్పి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది . కాస్టింగ్ కౌచ్ అంశాన్ని పక్కన పెడితే మెగా హీరోలను తిడుతూ సోషల్ మీడియాలో హంగామా చేసిన శ్రీ రెడ్డి నందమూరి హీరోలను మాత్రం భుజాన వేసుకొని మరీ పొగుడుతోంది దాంతో నందమూరి అభిమానులు మాత్రం శ్రీ రెడ్డి పట్ల సంతోషంగానే ఉన్నారు .

- Advertisement -

English Title: sri reddy tweets on ntr’s aravinda sametha

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All