Homeటాప్ స్టోరీస్టిఆర్ఎస్ ఎం ఎల్ ఏ జీవన్ రెడ్డి పై శ్రీ రెడ్డి ఆరోపణలు

టిఆర్ఎస్ ఎం ఎల్ ఏ జీవన్ రెడ్డి పై శ్రీ రెడ్డి ఆరోపణలు

sri reddy sensational comments on TRS leader jeevan reddy తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ జిల్లా ఎం ఎల్ ఏ జీవన్ రెడ్డి నాపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని సంచలన ఆరోపణలు చేసింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో నాతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా నేను అధికార పార్టీకి చెందిన వాడ్ని అంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని , బెల్లంకొండ సురేష్ కూడా అతడికి సహకరించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి . ఆరు నెలల క్రితం కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించింది శ్రీ రెడ్డి .

తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన శ్రీ రెడ్డి టిఆర్ఎస్ లో చాలా యాక్టివ్ గా ఉండే జీవన్ రెడ్డి పై ఆరోపణలు చేసింది . అయితే జీవన్ రెడ్డి కి శ్రీ రెడ్డి లొంగకపోవడంతో నేను అధికార పార్టీ కి చెందిన వాడ్ని అంటూ హెచ్చరికలు జారీ చేసాడట ! కానీ శ్రీ రెడ్డి మాత్రం భయపడకుండా అతడ్ని ఎదురించిందట . తెలంగాణలో ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో జీవన్ రెడ్డి ఇష్యూ టిఆర్ఎస్ కు ఇబ్బందే ! ఆ పార్టీ మీ టూ ఉద్యమం పై ఎలా స్పందిస్తుందో ! ఇక ఈ అంశం పై జీవన్ రెడ్డి ఎలా స్పందిస్తాడో చూడాలి . మొత్తానికి శ్రీ రెడ్డి టాలీవుడ్ ని మాత్రమే కాదు పొలిటికల్ రంగాన్ని కూడా వదిలేలా లేదు .

- Advertisement -

English Title: sri reddy sensational comments on TRS leader jeevan reddy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All