Homeటాప్ స్టోరీస్కాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు

కాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు

Meena react on casting couch కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా ఉందని ,మారోజుల్లో కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయని అయితే నాకు మాత్రం అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని అంటోంది సీనియర్ నటి మీనా . 90 వ దశకంలో గ్లామర్ తారగా ఓ ఊపు ఊపేసింది మీనా . తెలుగు , తమిళ , మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది మీనా . రజనీకాంత్ , కమల్ హాసన్ , చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ , డాక్టర్ రాజశేఖర్ , మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించింది మీనా .

అయితే ఈ భామ నటిస్తున్న సమయంలో కూడా కొంతమంది అదేపనిగా కాస్టింగ్ కౌచ్ కు పాల్పడే వాళ్ళట ! మా రోజుల్లో కూడా వెధవలు ఉన్నారని , ఇప్పుడు వినిపిస్తున్న కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు అప్పుడు కూడా ఉన్నాయని అయితే వాళ్లకు కూడా భార్యా పిల్లలు ఉన్నారన్న విషయాన్నీ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది . అంతేకాదు అప్పట్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉన్నప్పటికీ నాకు మాత్రం అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని అంటోంది . చాలామంది కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతున్నారు బాగానే ఉంది కానీ నాకు మాత్రం అలాంటి అనుభవం ఎదురు కాలేదని అంటున్నారు అదేంటో !

- Advertisement -

English Title: meena react on casting couch

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All