Homeటాప్ స్టోరీస్విశాల్ కు సారీ చెప్పిన శ్రీ రెడ్డి

విశాల్ కు సారీ చెప్పిన శ్రీ రెడ్డి

sri reddy  says sorry to hero vishalవివాదాస్పద నటి శ్రీ రెడ్డి హీరో విశాల్ కు క్షమాపణ చెప్పి సంచలనం సృష్టించింది . శ్రీ రెడ్డి లీక్స్ అంటూ తెలుగునాట చిత్ర పరిశ్రమని షేక్ చేసిన ఈ భామ తాజాగా తమిళ చిత్ర పరిశ్రమ మీద పడింది . పలువురిని అక్కడ టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేసింది . శ్రీకాంత్ , దర్శకులు మురుగదాస్ , రాఘవ లారెన్స్ ఇలా లిస్ట్ బయట పెట్టేసింది అంతేకాదు హీరో విశాల్ తో నాకు ఇబ్బందులు ఉన్నాయని బెదిరింపులు వస్తున్నాయని ట్వీట్ చేసి మరింతగా రెచ్చగొట్టిన శ్రీ రెడ్డి తాజాగా విశాల్ కు క్షమాపణ చెప్పడం సంచలనంగా మారింది .

విశాల్ పై ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి సడెన్ గా విశాల్ కు సారీ చెప్పడం ఏంటి ? అన్న రీతిలో ఆలోచిస్తున్నారు . అయితే తెరవెనుక ఏదో జరిగిందని అందుకే సారీ చెప్పిందని అంటున్నారు . శ్రీ రెడ్డి విశాల్ కు సారీ చెప్పడానికి కారణం ఏంటో తెలుసా ……. విశాల్ నడిగర్ సంఘానికి కార్యదర్శి అలాగే నిర్మాతల మండలి అధ్యక్షుడు కూడా దాంతో అన్యాయాలను ప్రశ్నించే అధికారం , సమస్యలను పరిష్కరించే స్థానంలో విశాల్ ఉండటమే శ్రీ రెడ్డి సారీ చెప్పడానికి కారణం . ఇక విశాల్ కూడా ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నాడట ! గతకొంతకాలంగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ , కోలీవుడ్ సతమతమౌతోంది . విశాల్ ఏదైనా పరిష్కారం చూపిస్తాడేమో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All