Homeటాప్ స్టోరీస్విశాల్ నుండి ప్రాణహాని ఉందంటున్న శ్రీ రెడ్డి

విశాల్ నుండి ప్రాణహాని ఉందంటున్న శ్రీ రెడ్డి

sri reddy fearing threat from hero vishalతమిళ స్టార్ హీరో విశాల్ నుండి నాకు ప్రాణహాని ఉందని సంచలన ఆరోపణలు చేస్తోంది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . తెలుగునాట శ్రీ రెడ్డి లీక్స్ అంటూ ప్రభంజనం సృష్టించిన ఈ భామ తాజాగా తమిళ ఇండస్ట్రీ పై పడింది . తెలుగు కుర్రాడు అయిన శ్రీ రామ్ తమిళ్ లో శ్రీకాంత్ పేరుతో నటిస్తున్నాడు కాగా ఆ హీరో సినిమాలో ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చి నన్ను వాడుకున్నాడని , ఆ అవసరం తీర్చుకొని ఇంతవరకు సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదని ఆరోపించిన ఈ భామ దర్శకులు మురుగదాస్ పై కూడా విమర్శలు చేస్తోంది .

ఇక విశాల్ విషయానికి వస్తే …… నాకు అతడి నుండి ఇబ్బంది ఉందని అయినప్పటికీ భయపడేది లేదని అంటోంది . ఇంకా తమిళనాట లీక్స్ చేయాల్సినవి ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే చేస్తానని అంటోంది . అయితే విశాల్ పై ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది ఎందుకంటే నాని పై శ్రీ రెడ్డి ఆరోపణలు చేసినప్పుడు నాని గురించి నాకు బాగా తెలుసనీ , ఒకవేళ శ్రీ రెడ్డి దగ్గర ఆధారాలు ఉంటే వాటిని బయటపెట్టాలని అన్నాడు అంతేకాదు శ్రీ రెడ్డి నాపై ఆరోపణలు చేసిన ఆశ్చర్యం లేదని నెల కిందటే అన్నాడు కట్ చేస్తే ఇప్పుడు విశాల్ పై ఆరోపణలు చేస్తోంది శ్రీ రెడ్డి . మరి ఇప్పుడు విశాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి .

- Advertisement -

English Title: sri reddy fearing threat from hero vishal

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All