Homeటాప్ స్టోరీస్'దుర్మార్గుడు' చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్

‘దుర్మార్గుడు’ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్

Durmargudu Movie First Lookఎ .ఎ .ఎ. సినిమాస్ సమర్పణలో అమృత మూవీ క్రియేషన్స్ పతాకంపై రాజ వంశీ నిర్మిస్తున్న చిత్రం ‘దుర్మార్గుడు’. సునీత్ జంపా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేయగా, మోషన్ పోస్టర్ ను తుమ్మల పల్లి రామసత్యనారాయణ, టీజర్ ను నిర్మాత బెక్కం వేణుగోపాల్ లు విడుదల చేశారు. అనంతరం

చిత్ర నిర్మాత రాజ వంశీ మాట్లాడుతూ…
అడగ్గానే పోస్టర్ లాంచ్ కు విచ్చేసిన హీరో శ్రీకాంత్ గారికి నా కృతజ్ఞతలు. టీమ్ అందరూ సపోర్ట్ చేయబట్టే ఈ సినిమా అంతా బాగా వచ్చి, పోస్టర్ల విడుదల కార్యక్రమాల వరకు వచ్చింది. ఒక మంచి సబ్జెక్ట్ తో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే దుర్మార్గుడు చిత్రాన్ని నిర్మించడం జరిగింది. దండుపాళ్యం లాంటి మాస్ ఇమేజ్ ఉన్న చిత్రంలా ఉంటుంది మా సినిమా కూడా.. అందరూ కొత్త వారే ఈ చిత్రంలో నటిస్తున్నారు…పక్కా తెలుగు సినిమా.. ప్రస్తుతం మిక్సింగ్ లో ఉంది… జులై లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు..

- Advertisement -

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ…
టీజర్ చాలా బాగుంది. పూర్తి మాస్ లుక్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది.. తప్పకుండా సక్సెస్ అవుతుందని భావిస్తూ… టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియచేస్తున్నా అన్నారు.

దర్శకుడు సునీత్ జంపా మాట్లాడుతూ..
అసిస్టెంట్ డైరెక్టర్ గా 2006 లో ఇండస్ట్రీకు ఎంటర్ అయ్యా… అంతకు ముందు మంగళగిరిలో డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగాను.. మురారి చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నప్పుడే నాకు డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన వచ్చింది… కాకినాడలో 6నెలలుగా గ్రౌండ్ వర్క్ చేసి 35 రోజులు కష్టపడి దుర్మార్గుడు చిత్రాన్ని తెరకెక్కించాము.. విజయ్ కృష్ణ, జారా లు ఇద్దరూ మనసుపెట్టి కష్టపడి నటించారు. జనాలకు నచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాం.. రాజ వంశీ నా స్నేహితుడు కావడంతో చాలా కంఫర్ట్ గా.. కో ఆపారేటివ్ గా వర్క్ చేయగలిగాము..
క్వాలిటీనే ప్రధానంగా సాగిన ఈ చిత్రం మాస్, క్లాస్ ఆడియోన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించాము. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు ఎమోషనల్ గా ఫీల్ అవుతారు కాకినాడ, ఉప్పడ పరిసరాల్లో షూటింగ్ జరుపుకున్నాము అన్నారు..

 

హీరో విజయ్ కృష్ణ మాట్లాడుతూ…
వంశీ గారి కష్టమే దుర్మార్గుడు. అందరూ ఎఫర్ట్ పెట్టి పనిచేశారు కనుక అందరికీ మంచిపేరు తెచ్చిపెడుతుందని చెప్పారు.

బెక్కం వేణుగోపాల్, తుమ్మల పల్లి రామసత్యనారాయణ, కో ప్రొడ్యూసర్ బాల ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను, అభినందనలను తెలియచేసారు.
విజయ్ కృష్ణ, జరాఖాన్, ఉమాశంకర్, సూర్య మయి, రచ్చరవి, మురళి, కోటేశ్వర దేవరకొండ, దినేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మల్లిక్ పుట్టా, మ్యూజిక్: చిన్ని కృష్ణ, ఎడిటర్: రాజ్ కుమార్, స్క్రీన్ ప్లే: సురేష్, స్టంట్స్: రామ్ సుంకర, కో ప్రొడ్యూసర్: బాల ప్రసాద్, మేడపాటి కృష్ణారెడ్డి, లిరిక్స్: తిరుపతి జవాన, డైలాగ్స్:
మాకల రవి, కొరియోగ్రాఫర్: విఘ్నేష్, వి ఎమ్. కృష్ణ, నిర్మాత: రాజ వంశీ, దర్శకత్వం: సునీత్ జంపా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All