HomeUncategorizedవ‌ర్మ హీరోయిన్ మ‌ళ్లీ రెచ్చిపోయిందిగా!

వ‌ర్మ హీరోయిన్ మ‌ళ్లీ రెచ్చిపోయిందిగా!

వ‌ర్మ హీరోయిన్ మ‌ళ్లీ రెచ్చిపోయిందిగా!
వ‌ర్మ హీరోయిన్ మ‌ళ్లీ రెచ్చిపోయిందిగా!

రామ్‌గోపాల్ వ‌ర్మతో క‌లిసి లాక్‌డౌన్ టైమ్‌లో ర‌చ్చ చేసింది శ్రీ రాపాక‌. `నేక్ డ్ ` (న‌గ్నం) పేరుతో వ‌ర్మ చేసిన వెబ్ ఫిల్మ్‌తో సంచ‌ల‌నం సృష్టించింది. హ‌ద్దులు దాటిన ఎక్స్‌పోజింగ్‌తో ఇంట‌ర్నెట్‌ని హీటెక్కించింది. తొలి మూవీతో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచిన శ్రీ రాపాక ఓ కాస్ట్యూమ్ డిజైన‌ర్ అన్న విష‌యం తెలిసిందే.

`నగ్నం`తో పాపుల‌ర్ అయిన శ్రీ రాపాక మ‌రో వెబ్ ఫిల్మ్‌తో రాబోతోంది. ఆమె న‌టిస్తున్న వెబ్ థ్రిల్ల‌ర్ `ద ల‌స్ట్ ఏ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ`. ఎస్ కె. ఎన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. థ‌ర్డ్ ఐ మూవీస్ బ్యాన‌ర్‌పై అశోక్ షిండే ఈ వెబ్ సిరీస్‌ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. మ‌ర్డ‌ర్, వివాహేత‌ర సంబంధాల నేప‌థ్యంలో ఈ వెబ్ డ్రామాని రూపొందించారు. ట్రైల‌ర్‌లో మోతాదుకు మించిన స‌న్నివేశాలున్నాయి. కొన్ని సీన్‌ల‌లో శ్రీ‌రాపాక మ‌ళ్లీ రెచ్చిపోయింది.

- Advertisement -

యువ‌త‌ని టార్గెట్ చేస్తూ ఈ వెబ్ డ్రామాని మొత్తం ల‌స్ట్ సీన్‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కించిన‌ట్టుగా క‌నిపిస్తోంది. `నేక్ డ్‌`లో థై షో చేస్తూ అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న చేసి సంచ‌ల‌నం సృష్టించిన శ్రీ రాపాక ఇందులో అంత‌త‌కు మించి ప్ర‌ద‌ర్శించింది. మ‌రింత ముందుకు వెళ్ల‌డానికి కూడా త‌ను సిద్ధ‌మ‌నే సంకేతాల్ని అందించింది. ల‌స్ట్‌.. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ అంశాల మేవింపుతో రూపొందించిన ఈ వెబ్ థ్రిల్ల‌ర్‌ని ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్నారు. అమ‌త్ తివారి, ఛ‌త్ర‌ప‌తి ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, శ్రీ గ‌గ‌న్‌, అనంద్ భార‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All