Homeటాప్ స్టోరీస్లాక్‌డౌన్ వేళ రామ్‌గోపాల్ వ‌ర్మ గిఫ్ట్‌!

లాక్‌డౌన్ వేళ రామ్‌గోపాల్ వ‌ర్మ గిఫ్ట్‌!

లాక్‌డౌన్ వేళ రామ్‌గోపాల్ వ‌ర్మ గిఫ్ట్‌!
లాక్‌డౌన్ వేళ రామ్‌గోపాల్ వ‌ర్మ గిఫ్ట్‌!

వివాదాల్ని… విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని రామ్ గోపాల్‌వ‌ర్మ వాడుకున్న‌త ఈజీగా మ‌రెవ్వ‌రూ వాడుకోలేరంటే అది అతిశ‌యోక్తి కాదేమో. ఎక్క‌డ వివాదం వుంటే అక్క‌డే అడుగు పెట్ట‌డం వ‌ర్మ‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. వివాదాన్నే త‌న‌కు ప్ర‌చారంగా మార్చుకుంటూ దాన్నే సినిమాగా మ‌ల‌చ‌డంలోనూ వ‌ర్మ‌ను మించిన వాళ్లు లేరు. తాజ‌గా క‌రోనా మ‌హ‌మ్మారి విళ‌య‌తాండ‌వ సృష్టిస్తున్న వేళ వ‌రుస ట్వీట్‌ల‌తో వార్త‌ల్లో నిలిచారు వ‌ర్మ‌.

ఆయ‌న చేసిన‌న్ని ట్వీట్‌లు క‌రోనాపై మ‌రెవ‌రూ చేయ‌లేదు. ఇక ఆయ‌న క‌న్ను తాజాగా లాక్‌డౌన్‌పై ప‌డింది. లాక్‌డౌన్ వేళ అంతా  ఇంటిప‌ట్టునే వుండి క‌రానా భారీన ప‌డ‌కుండా జాత్ర‌త్త‌లు తీసుకుంటుండే ఈ స‌మ‌యాన్ని కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ మ‌ధ్య `జీఎస్టీ` అంటూ పోర్న్ స్టార్ మియామాల్కోవాతో హంగామా చేసిన వ‌ర్మ ఈ లాక్‌డౌన్ వేళ మ‌ళ్లీ ఆమెనే న‌మ్ముకుని `క్లైమాక్స్‌` అంటూ ఓ ఫిల్మ్‌ని రూపందించారు.

- Advertisement -

లాక్‌డౌన్ వేళ తానిస్తున్న గిఫ్ట్ అంటూ ప్ర‌చారం మొద‌లుపెట్టిన వ‌ర్మ గురువారం సాయంత్రం `క్లైమాక్స్‌`కి సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేశాడు. ఈ టీజ‌ర్‌లో అంతా ఊహించిన‌ట్టే మియా మాల్కోవా అందాల‌ని తెర నిండా ఆర‌బోశాడు. ఎంత వ‌ర‌కు కుర్ర కారుని కిర్రెక్కించాలో అంత వ‌ర‌కు మియా అందాల్ని క్యావ్వాస్‌పై ఆవిష్క‌రించాడు.  ఎడారిలోని ఓయాసిస్సు ప్రాంతంలో మియా మాల్కోవాతో తెర‌కెక్కించిన ఈ `క్లైమాక్స్‌`తో ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌నున్నారో చూడాలి. శ్రేయాస్ ఈటీ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్ ఎస్ ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ మూవీ ట్రైల‌ర్‌ని ఈ నెల 18న రిలీజ్ చేయ‌బోతున్నాన‌ని, లాక్‌డౌన్ స‌మ‌యంలో మియా మాల్కోవాతో క‌లిసి తాను అందిస్తున్న గిఫ్ట్ ఇద‌ని టీజ‌ర్‌లో వెల్ల‌డించడం విశేషం.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All