Homeటాప్ స్టోరీస్రామ్‌గోపాల్‌వ‌ర్మ చిలిపి కోరిక‌!

రామ్‌గోపాల్‌వ‌ర్మ చిలిపి కోరిక‌!

రామ్‌గోపాల్‌వ‌ర్మ చిలిపి కోరిక‌!
రామ్‌గోపాల్‌వ‌ర్మ చిలిపి కోరిక‌!

నిత్యం వివాదాస్ప‌ద ట్వీట్‌ల వార్త‌ల్లో నిలుస్తుంటారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. క‌రోనా వైర‌స్ దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ముందుగా క‌రోనాపై వ‌రుస ట్వీట్‌లు చేసి వార్త‌ల్లో నిలిచిన వ‌ర్మ ఎప్ప‌టి క‌ప్పుడు కొత్త కొత్త ట్వీట్‌ల‌తో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తూనే వున్నారు. ఇటీవ‌ల మందు బాబుల గురించి ఓ ట్వీటేసి అడ్డంగా బుక్కైన వ‌ర్మ ఆ త‌రువాత జ‌రిగిన త‌ప్పుకి లెంప‌లేసుకున్నారు కూడా.

క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో మందు దొర‌క్క‌పోవ‌డంతో మందు బాబులు చిత్ర విచ్చింగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, వారిని ఆదుకోవ‌డం కోసం మ‌మ‌తా బెన‌ర్జీప్ర‌భుత్వం పెద్ద మ‌న‌సుతో ఇంటింఇటికి మ‌ద్యాన్ని స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని, అదే త‌ర‌హాలో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌ని వ‌ర్మ ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ నుంచి వ‌ర్మ‌కు షాకిచ్చే రిప్లై వ‌చ్చింది.

- Advertisement -

ఇదిలా వుంటే వ‌ర్మ తాజాగా చేసిన ట్వీట్ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఓ ఎడిర్‌ని వివాహం చేసుకోవాల‌ని వుంద‌ని వ‌ర్మ ట్వీట్ చేయ‌డం విస్మ‌యానికి గురిచేస్తోంది. `ద‌ళ‌ప‌తి` చిత్రంలోని `ఇంగారాల పైరుల్లోన‌.. అంటూ సాగే పాట‌కు అమిరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్ర‌ధాని మోదీ వీడియోల‌ని సింక్ చేసి ఓ ఎడిట‌ర్ మ్యాజిక్ చేశాడు. దీనికి ముగ్ధుడైన వ‌ర్మ ఈ ఎడిట‌ర్‌ని పెళ్లి చేసుకోవాల‌ని వుంద‌ని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ చూసిన వారంతా వ‌ర్మ చిలిపి కోరిక ఫ‌లిస్తుందా? అని సెటైర్లు వేస్తున్నారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All