
మనోభావాలు దెబ్బతినడం.. దాంతో సదరు వ్యక్తులపై కేసులు నమోదు కావడం ఈ మధ్య కాలంలో చూస్తూనే వున్నాం. తాజాగా ఈ వివాదంలో క్రేజీ యాంకర్, నటి శ్రీముఖి ఇరుక్కున్నారు. ఇటీవల ఓ టీవీ ఛానల్‌లో శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రామంలో బ్రాహ్మణుల్ని కించపరిచారంటూ నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి బంజారాహిల్స్‌లో శ్రీముఖిపై కేసు పెట్టారు.
ఈ వార్త ప్రముఖంగా వినిపించడంతో తాజాగా తనపై కేసు నమోదు కావడంపై శ్రీముఖి స్పందించారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా కామెడీ షోలోని దృశ్యాలు వున్నాయని గ్రహించిన వెంకటరమణ శర్మ అనే ఆ వీడియోలని సేకరించి వాటిని సాక్ష్యంగా చూపిస్తూ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు ఫైల్ చేయించారు.
అయితే తనకి ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదని, సమాజంలో అన్ని వర్గాలను తాను సమాన గౌరవం ఇస్తానని శ్రీముఖి స్పష్టం చేసింది. తనపై కేసు నమోదు కావడాన్ని చూసి షాక్‌కు గురయ్యానని, ఈ విషయంలో పోలీసులకు సహకరించడానికి తాను సిద్ధంగా వున్నానని వెల్లడించింది.