Homeటాప్ స్టోరీస్చ‌ర‌ణ్‌దీప్ కొత్త బిజినెస్ మొద‌లుపెట్టాడు

చ‌ర‌ణ్‌దీప్ కొత్త బిజినెస్ మొద‌లుపెట్టాడు

చ‌ర‌ణ్‌దీప్ కొత్త బిజినెస్ మొద‌లుపెట్టాడు
చ‌ర‌ణ్‌దీప్ కొత్త బిజినెస్ మొద‌లుపెట్టాడు

`బాహుబ‌లి` చిత్రంలో కాల‌కేయుడికి త‌మ్మునిగా న‌టించిన చ‌ర‌ణ్‌దీప్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు.  వ‌రుణ్‌తేజ్ న‌టించిన `లోఫ‌ర్‌`, మెగాస్టార్ న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి`లో , రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టించి పీఎస్వీ గ‌రుడ వేగ‌, క‌ల్కీ చిత్రాల్లో నెగెటివ్ పాత్ర‌ల్లో న‌టించాడు. టాలీవుడ్‌తో పాటు త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల్లో ప్ర‌తి నాయ‌కుడిగా న‌టించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న చ‌ర‌ణ్‌దీప్ సూరినేని తాజాగా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు.

కొత్త‌గా ఆన్ లైన్ వ్యాపారం ప్రారంభించారు. త‌న స్నేహితుడు సునీల్‌కుమార్‌తో క‌లిసి `జ‌స్ట్ హ్యాపీ‌` పేరుతో ఒక యాప్ ప్రారంభించారు. దీని ద్వారా నిత్యావ‌స‌ర స‌రుకులు, కాయ‌గూర‌లు, ప‌ల్లు. పాలు, పెరుగు, చికెన్‌, మ‌ట‌న్‌, ఫిష్ వంటి ఉత్ప‌త్తుల్ని ఆర్డ‌ర్ ల ద్వారా  డోర్ డెలివ‌రీ చేయ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ యాప్‌కి ప‌దివేల మంది లాయ‌ల్ క‌స్ట‌మ‌ర్లు వున్నారు. సుమారు ఏడాదిగా సేవ‌ల్ని అందిస్తోంది. లాభాపేక్ష లేకుండా నిత్యావ‌స‌రాల్ని అందిస్తోంది.

- Advertisement -

త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ సిటీలో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌న‌గ‌ర్‌, మ‌ణికొండ‌, బాలాన‌గ‌ర్‌, చింత‌ల్‌, షాపూర్‌, జీడిమెట్ల‌, సుచిత్ర‌, కొంప‌ల్లి స‌హా ఖ‌మ్మంలో సేవ‌ల్ని విస్త‌రించ‌బోతున్నారు. ఇత‌ర ఆన్‌లైన్ స్టోర్స్‌ కంటే మా యాప్‌లో ధ‌ర‌లు త‌క్కువ అని, ప్ర‌తిరోజు స‌రికొత్త డిస్కౌంట్స్ ఉంటాయి. ఫ్రాంచైజీ కోసం ఆస‌క్తిగ‌ల వారు మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించ‌వ‌చ్చు అని చ‌ర‌ణ్‌దీప్ తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All