Homeటాప్ స్టోరీస్మళ్ళీ ఆశలు చిగురింపజేసిన ఎస్ఆర్ కళ్యాణమండపం

మళ్ళీ ఆశలు చిగురింపజేసిన ఎస్ఆర్ కళ్యాణమండపం

మళ్ళీ ఆశలు చిగురింపజేసిన ఎస్ఆర్ కళ్యాణమండపం
మళ్ళీ ఆశలు చిగురింపజేసిన ఎస్ఆర్ కళ్యాణమండపం

దాదాపు నాలుగు నెలల గ్యాప్ తర్వాత జులై చివరి వారం నుండి థియేటర్లు తెరుచుకున్నాయి. తిమ్మరుసు, ఇష్క్ సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో తిమ్మరుసు పర్వాలేదు అనుకుంది కానీ ఇష్క్ ప్లాప్ అవ్వాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాతి వారం కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఎస్ఆర్ కల్యాణమండపం విడుదలైంది. దీనికి రివ్యూస్ సరిగా రాలేదు. దానికి తోడు నెక్స్ట్ వారం ఏ సినిమాలు విడుదలను అనౌన్స్ చేయకపోవడంతో ఇక థియేటర్స్ ను మరోసారి మూసేయాలి ఏమో అనుకున్నారు.

అయితే రివ్యూస్ బాగోకపోయినా ఎస్ఆర్ కల్యాణమండపం మాత్రం కలెక్షన్స్ పరంగా మెప్పించింది. తొలి రోజు స్ట్రాంగ్ గా మొదలైన ఎస్ఆర్ కల్యాణమండపం వీకెండ్ కు చేరుకునే సరికి చాలా చోట్ల సేఫ్ వెంచర్ గా నిలిచింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలలో మళ్ళీ ఆశలు చిగురించాయి.

- Advertisement -

ఆగస్ట్ 14న విశ్వక్ సేన్ నటించిన పాగల్ విడుదలవుతుంది. ఆ తర్వాత ఆగస్ట్ 19న గోపీచంద్ సీటిమార్ విడుదలవుతుంది. సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్, సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాలు సరైన విడుదల తేదీ కోసం చూస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All