Homeటాప్ స్టోరీస్ఎస్ ఆర్ కల్యాణమండపం మూవీ రివ్యూ

ఎస్ ఆర్ కల్యాణమండపం మూవీ రివ్యూ

ఎస్ ఆర్ కల్యాణమండపం మూవీ రివ్యూ
ఎస్ ఆర్ కల్యాణమండపం మూవీ రివ్యూ

తారాగణం: కిరణ్ అబ్బవరం, సాయి కుమార్, ప్రియాంక జవాల్కర్
దర్శకుడు: శ్రీధర్ గాదె
నిర్మాత: ప్రమోద్
మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్
విడుదల తేదీ: ఆగస్ట్ 6, 2021
రేటింగ్ ‌: 2.75/5

ఎస్ ఆర్ కల్యాణమండపం… చిన్న సినిమాలలో రీసెంట్ కాలంలో అత్యంత ఆసక్తి కలిగించిన సినిమా ఇది. రాజా వారు రాణి గారు చిత్రం ద్వారా పరిచయమైన కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో హీరోగా నటించగా ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా చేసింది. మంచి అంచనాల మధ్య ఈరోజే విడుదలైన సినిమా ఎలా ఉందో చూద్దాం.

- Advertisement -

కథ:
కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) అల్లరిచిల్లరిగా తిరిగే యూత్. తన బిటెక్ క్లాస్ మేట్ సింధు (ప్రియాంక జవల్కర్)ను ప్రేమిస్తుంటాడు. అయితే కళ్యాణ్ కు తన తండ్రి ధర్మ (సాయి కుమార్)కు మధ్య ఈగో సమస్యలు ఉంటాయి. అయితే తన తండ్రితో వాటిని చర్చించడానికి ముందుకు రాడు కళ్యాణ్. అసలు కళ్యాణ్ సమస్య ఏంటి? దాన్నుండి బయటపడటానికి తను ఏం చేసాడు అన్నది ఎస్ ఆర్ కల్యాణమండపం మిగిలిన కథ.

నటీనటులు:
కిరణ్ అబ్బవరం చాలా కాన్ఫిడెంట్ గా ఈ సినిమాలో నటించాడు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో కూడా రాణించాడు. ప్రియాంక జవల్కర్ తన న్యాచురల్ యాక్టింగ్ తో మెప్పించింది. అయితే ఈ చిత్రంలో స్టాండౌట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది మాత్రం కచ్చితంగా సాయి కుమార్ అనే చెప్పాలి. ధర్మ పాత్రలో సాయి కుమార్ నటన తిరుగులేదు. తాగుబోతు తండ్రి పాత్రలో మెప్పించాడు. శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ఓకే. మిగిలిన వాళ్ళు అందరూ తమ పరిధుల మేర బాగానే చేసారు.

సాంకేతిక వర్గం:
ఈ చిత్రానికి దర్శకుడు శ్రీకాంత్ గాదె అయినా కానీ కిరణ్ అబ్బవరం కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. అయితే చిత్ర కథ చాలా రొటీన్. స్క్రీన్ ప్లే లో కూడా కొన్ని లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. డైలాగ్స్ అక్కడక్కడా మెరుస్తాయి. దర్శకత్వం ఓకే. సెకండ్ హాఫ్ పై ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. క్లైమాక్స్ చిత్రానికి మైనస్ పాయింట్. ఎడిటింగ్ పర్వాలేదు కానీ సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ ను ట్రిమ్ చేయవచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. మిగిలిన వారంతా మాములే.

చివరిగా:
ఎస్ ఆర్ కల్యాణమండపం మొదలవ్వడం ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. అయితే అసలు పాయింట్ కు వచ్చేసరికి ఎస్ ఆర్ కల్యాణమండపం తడబడుతుంది. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అంటూ కీలకమైన డిపార్ట్మెంట్స్ తీసుకున్న కిరణ్ అబ్బవరం పూర్తి న్యాయం చేయలేకపోయాడు. తండ్రీ కొడుకుల బంధాన్ని ఇంకా ఎఫెక్టివ్ గా చూపించవచ్చు. మొత్తంగా ఎస్ఆర్ కల్యాణమండపం ఒకసారి చూడగలిగే చిత్రంగా మిగిలింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All