Homeటాప్ స్టోరీస్సుధీర్ బాబు మరో సినిమాను అనౌన్స్ చేసాడే!!

సుధీర్ బాబు మరో సినిమాను అనౌన్స్ చేసాడే!!

సుధీర్ బాబు మరో సినిమాను అనౌన్స్ చేసాడే!!
సుధీర్ బాబు మరో సినిమాను అనౌన్స్ చేసాడే!!

సుధీర్ బాబు సడెన్ గా తన కెరీర్ లో గేర్లు మార్చేశాడు. ఇప్పటికే రెండు సినిమాల్లో నటిస్తోన్న సుధీర్ ఇప్పుడు మరో చిత్రాన్ని ఓకే చేసాడు. శ్రీదేవి సోడా సెంటర్ వంటి మాస్ చిత్రాన్ని చేస్తోన్న సుధీర్ బాబు దానికి పూర్తి భిన్నంగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా సాగుతున్నాయి.

తాజాగా ఇప్పుడు మరో సినిమాను కూడా ప్రకటించాడు సుధీర్ బాబు. నటుడు కమ్ రచయిత హర్షవర్ధన్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే లవ్ స్టోరీ చిత్రాన్ని నిర్మించింది. లక్ష్య నిర్మాణ దశలో ఉంది. అలాగే ధనుష్ – శేఖర్ కమ్ముల సినిమాను కూడా నిర్మించాల్సి ఉంది.

- Advertisement -

మరోవైపు హర్షవర్ధన్ ఇష్క్ వంటి సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All