Homeటాప్ స్టోరీస్ఎస్ఆర్ కళ్యాణమండపం ఓటిటి రిలీజ్ కు ముహూర్తం కుదిరింది

ఎస్ఆర్ కళ్యాణమండపం ఓటిటి రిలీజ్ కు ముహూర్తం కుదిరింది

ఎస్ఆర్ కళ్యాణమండపం ఓటిటి రిలీజ్ కు ముహూర్తం కుదిరింది
ఎస్ఆర్ కళ్యాణమండపం ఓటిటి రిలీజ్ కు ముహూర్తం కుదిరింది

సినిమా థియేటర్లు తిరిగి తెరుచుకున్నాక విడుదలైన సినిమాల్లో ఎస్ఆర్ కళ్యాణమండపం కూడా ఒకటి. ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కానీ కలెక్షన్స్ మాత్రం బాగా వచ్చాయి. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. థియేటర్లలో హిట్ అనిపించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో విడుదలకు ముహూర్తం కుదుర్చుకుంది. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను చేజిక్కించుకుంది.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించగా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా చేసింది. సాయి కుమార్ హీరో తండ్రిగా ప్రముఖ పాత్రలో కనిపించాడు. ఎక్కువగా మలయాళం డబ్బింగ్ సినిమాలతో ఆహా పాపులర్ అయింది. వీటికి తోడు క్రాక్, కలర్ ఫోటో, కుడి ఎడమైతే వంటి ఆసక్తికర సినిమాలు కూడా ఉన్నాయి. ఆగస్ట్ 27 నుండి ఈ సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతుంది.

- Advertisement -

శ్రీధర్ గాదె డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All