Thursday, October 6, 2022
Homeటాప్ స్టోరీస్ఆహా నుండి మరో వెబ్ సిరీస్ - అన్యాస్ ట్యుటోరియల్

ఆహా నుండి మరో వెబ్ సిరీస్ – అన్యాస్ ట్యుటోరియల్

ఆహా నుండి మరో వెబ్ సిరీస్ - అన్యాస్ ట్యుటోరియల్
ఆహా నుండి మరో వెబ్ సిరీస్ – అన్యాస్ ట్యుటోరియల్

ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ కంటెంట్ విషయంలో చాలా దూకుడుగా వెళుతోంది. ఇప్పటికే తెలుగువారి కోసం మంచి కంటెంట్ చాలానే ఉంది. ఇక అల్లు అరవింద్ సారధ్యంలో మరిన్ని వెబ్ సిరీస్, వెబ్ ఫిలిమ్స్ ను లాంచ్ చేయబోతున్నారు. తాజాగా ఆహా ప్రకటించిన వెబ్ సిరీస్ అన్యాస్ ట్యుటోరియల్. ఈ వెబ్ సిరీస్ ను సౌమ్య అనే కొత్తమ్మాయి లాక్ డౌన్ సమయంలో బోర్ గా ఫీలైనప్పుడు రాసిందిట.

- Advertisement -

రెజీనా, నివేదిత, నరేష్ అగస్త్య ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 7 ఎపిసోడ్స్ ఉండే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. పల్లవి గంగిరెడ్డి ఈ సిరీస్ ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతోంది.

ఈ వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ నిర్మిస్తుండగా అల్లు అరవింద్ ఆహా ద్వారా సమర్పిస్తున్నాడు. క్రిస్మస్ సమయానికి ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts