Homeన్యూస్ప్రభాస్ స్పిరిట్ లో కొరియన్ భామ..  బాలీవుడ్ బెబో?

ప్రభాస్ స్పిరిట్ లో కొరియన్ భామ..  బాలీవుడ్ బెబో?

ప్రభాస్ స్పిరిట్ లో కొరియన్ భామ..  బాలీవుడ్ బెబో?
ప్రభాస్ స్పిరిట్ లో కొరియన్ భామ..  బాలీవుడ్ బెబో?

రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను దున్నేస్తున్నాడు. బాహుబలి తర్వాతి నుండి అన్నీ ప్యాన్ ఇండియన్ సినిమాలే చేస్తూ వస్తోన్న ప్రభాస్, వరసగా ఐదు ప్రాజెక్ట్ లను సెట్  చేయడం విశేషమే. రాధే శ్యామ్ 2022 జనవరిలో విడుదల కానుండగా ఆది పురుష్ షూటింగ్ ను పూర్తి చేసాడు ప్రభాస్. ఆ తర్వాత సలార్ షూటింగ్ దశలో ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ కె లైన్లో ఉంది.

రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ ను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మాత్రమే కాకుండా జాపనీస్, చైనీస్, కొరియన్ మార్కెట్ లలో కూడా విడుదల చేస్తారట. ఇందుకోసం అక్కడ పేరున్న వారిని తీసుకోబోతున్నారని తెలుస్తోంది. కొరియన్ టివి డ్రామాలతో ఫేమస్ అయిన నటి సాంగ్ హై క్యోను హీరోయిన్ గా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

అంతే కాకుండా బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తుందని అంటున్నారు. ఐతే ఈ రెండూ కూడా కేవలం ప్రచారంలో ఉన్న వార్తలు మాత్రమే. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All