
కింగ్ నాగార్జున `మన్మథుడు 2` తరువాత కొంత విరామం తీసుకుని నటిస్తున్న చిత్రం `వైల్డ్ డాగ్`. కొత్త దర్శకుడు `హిషోర్ సాల్మన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలోఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్ బిఫోర్ ఈ చిత్రానికి సంబంధించిన కీలక ఘట్టాలని షూట్ చేశారు.
ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పునః ప్రారంభమైంది. బిగ్‌బాస్ ప్రోమోస్‌లో నటిస్తూనే నాగ్ `వైల్డ్ డాగ్` షూట్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 4కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ షోకి బూస్టప్ ఇస్తున్న నాగార్జున త్వరలో `వైల్డ్ డాగ్` షూట్‌లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ ఈ నెలాఖరున కులుమనాలిలో ప్రారంభం కాబోతోంది.
మొత్తం పది రోజుల పాటు షూట్ చేయబోతున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఈ షూట్ కోసం నాగార్జున కులమనాలి వెళ్లడం కొంత ఇబ్బందిగా మారిందట. వారాంతంలో బిగ్‌బాస్ షోలో నాగ్ పాల్గొనాలి కాబట్టి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసిన మేకర్స్ నాగ్ కోసం ప్రత్యేకంగా ఓ చార్టెడ్ ఫ్లైట్‌ని ఏర్పాటు చేస్తున్నారట. `వైల్డ్ డాగ్` షూట్ పూర్తి కాగానే నాగ్ చార్టెడ్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌లో వాలిపోనున్నారట.