Thursday, December 8, 2022
Homeటాప్ స్టోరీస్సుశాంత్ ఫ్యాన్స్ దెబ్బ.. అకౌంట్ డీయాక్టివేట్ చేసిన స్టార్ కిడ్

సుశాంత్ ఫ్యాన్స్ దెబ్బ.. అకౌంట్ డీయాక్టివేట్ చేసిన స్టార్ కిడ్

సుశాంత్ ఫ్యాన్స్ దెబ్బ.. అకౌంట్ డీయాక్టివేట్ చేసిన స్టార్ కిడ్
సుశాంత్ ఫ్యాన్స్ దెబ్బ.. అకౌంట్ డీయాక్టివేట్ చేసిన స్టార్ కిడ్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం బాలీవుడ్ లో రోజురోజుకూ ముదురుతోంది. ముఖ్యంగా సుశాంత్ ది ఆత్మహత్య కాదని, అతను ఆత్మహత్య చేసుకునేలా బాలీవుడ్ అంతా కలిసి పన్నాగం పన్నిందని సుశాంత్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. నేపోటిజం బాలీవుడ్ లో పాతుకుపోయిందని, అదే సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. దీంతో స్టార్ కిడ్స్ కు సోషల్ మీడియాలో బుల్లీయింగ్ తప్పట్లేదు.

- Advertisement -

ఒక స్టార్ కిడ్ సోనాక్షి సిన్హా ఇప్పుడు ఈ సోషల్ మీడియా బుల్లియింగ్ దెబ్బకు తన అకౌంట్ ను డిజేబుల్ చేసేసింది. నెగటివిటీ నుండి దూరంగా ఉండడానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సోనాక్షి సిన్హా తన ట్విట్టర్ అకౌంట్ ను డిజేబుల్ చేస్తూ నెగటివిటీ ఇక్కడ ఉన్నంత ఎక్కడా ఉండదని, తన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ట్విట్టర్ కు దూరంగా ఉండడమే బెస్ట్ అని అందుకే అకౌంట్ ను తీసేస్తున్నానని చెప్పింది.

దబంగ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శత్రుజ్ఞ సిన్హా కూతురు సోనాక్షి సిన్హా, తొలి చిత్రంతోనే అభిమానుల మనసును గెలుచుకుంది. ఈ మధ్య సినిమాలను బాగా తగ్గించేసింది ఈ అమ్మడు. ఆఖరుగా దబంగ్ 3లో నటించింది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts