Homeగాసిప్స్సోనాక్షి సిన్హా కాదు.. మరి బాలయ్య సినిమాలో హీరోయిన్ ఎవరు?

సోనాక్షి సిన్హా కాదు.. మరి బాలయ్య సినిమాలో హీరోయిన్ ఎవరు?

సోనాక్షి సిన్హా కాదు.. మరి బాలయ్య సినిమాలో హీరోయిన్ ఎవరు?
సోనాక్షి సిన్హా కాదు.. మరి బాలయ్య సినిమాలో హీరోయిన్ ఎవరు?

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనులది సూపర్ హిట్ కాంబినేషన్. ఇప్పటివరకూ వీరిద్దరూ కలిసి అందించిన రెండు సినిమాలు సింహ, లెజండ్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. దీంతో సహజంగానే మూడో సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొడతారని ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా లాంఛనంగా ఇటీవలే ప్రారంభమైన విషయం తెల్సిందే. అయితే షూటింగ్ ఎప్పుడు దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. జనవరి నుండి ఉండొచ్చు అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక, షూటింగ్ షెడ్యూల్స్ వంటి ప్లానింగ్స్ నడుస్తున్నాయి. ఇంకా ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో చాలా పేర్లు వినిపిస్తున్న విషయం తెల్సిందే.

అయితే గత కొద్ది రోజులుగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఈ సినిమాలో హీరోయిన్ అంటూ వార్త బలంగా వ్యాప్తి చెందింది. అది చివరికి సోనాక్షిని కూడా చేరుకుంది. దాంతో ఆమె క్లారిటీ ఇచ్చింది. అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమాలో నేను హీరోయిన్ గా చెయ్యట్లేదు. ఆ వార్తల్లో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చేసింది సోనాక్షి సిన్హా. ఈమె నటించట్లేదు అని తేలింది కానీ హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. దాంతో సరికొత్త రూమర్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ ఒక హీరోయిన్ గా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రద్ధ శ్రీనాథ్ జెర్సీ సినిమాతో తెలుగునాట సుపరిచితమే. మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది శ్రద్ధ.

- Advertisement -

మరి ఈమైనా ఈ సినిమాలో నటించడం అన్నది నిజమేనా లేక ఇది కూడా ఒట్టి పుకారుగా మిగిలిపోతుందా అన్నది తెలియాలి. దీంతో పాటు విలన్లుగా సంజయ్ దత్, శ్రీకాంత్ నటిస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. మరి వీటిలో నిజానిజాలెంతో కూడా తెలియాలి.

ప్రస్తుతం బాలకృష్ణ తన ఫోకస్ అంతా రిలీజవబోతోన్న రూలర్ సినిమాపైనే పెట్టాడు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానున్న విషయం తెల్సిందే. మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి. కెఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. వేదిక, సోనాల్ చౌహన్ కథానాయికలు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All