
సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్`. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నభా నటేష్ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గా ఎనిమిది నెలలుగా థియేటర్లు మూసివేయడంతో ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రాన్నిథియేటర్లలో క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ మీడియాతో ముచ్చటించింది.
– తేజ్ నాకు మంచి ఫ్రెండ్. సపోర్టర్. టీమ్ అంతా చాలా ఆతృతతో ఏదో సాధించాలనే తపనతో పని చేశారు. మా దర్శకుడు సుబ్బుకి ఇది తొలి సినిమా. చాలా హ్యాపీగా అనిపించింది. యంగ్ టీమ్‌తో పాటు సినిమాలో రాజేంద్రప్రసాద్, నరేష్ లాంటి సీనియర్ స్టార్స్ కూడా వున్నారు. తమన్ అద్భుతమైన ట్యూన్స్ అందించారు. ఆల్బమ్ చాలా పెద్ద హిట్ అయింది. లాక్‌డౌన్ తరువాత ఒక పాటను విడుదల చేశాం. నో పెళ్లి.. ఆ తరువాత హే ఇది నేనేనా.. విడుదల చేశాం. విన్నవాళ్లందరూ బావుందంటున్నారు. ట్రైలర్‌కి మంచి స్పందన లభిస్తోంది.
– సినిమాని ఓటీటీలో చూడటానికి టక్కెట్ కొని బిగ్ స్క్రీన్‌పై చూడటానిక చాలా తేడా వుంటుంది. డిసెంబర్ 25న విడుదలవుతున్న మా సినిమాను థియేటర్లలో ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారా అని నాకు ఆసక్తిగా వుంది.
– కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో `సోలో బ్రతుకే సోబెటర్` సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని అన్నారు. అది విని కాస్త టెన్షన్ అనిపించింది. ఫ్యామిలీ ని ఎంటర్‌టైన్ చేసే మూవీ ఇది. థియేటర్‌లోకి వస్తే బావుంటుంది అనుకున్నాను. పరిస్థితులు అలా వున్నాయి ఎవరూ ఏమీ చేయలేరు కదా అనిపించింది. అయితే ఈ లోపు థియేటర్లు రీఓపెన్ కావడం మా మేకర్స్ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడానికి అంగీకరించడంచకచకా జరిగిపోయాయి.
– ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశాను. రేపు సినిమా విడుదలైన తరువాత నేను ఎందుకు ఇలా చెప్పానో మీకే అర్థమవుతుంది. సినిమా విడుదలైన తరువాత నా పాత్ర గురించి మాట్లాడుతాను. కొన్ని విలువల్ని పాటించే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నా పాత్రను డైరెక్టర్ సుబ్బు ఎంటర్‌టైనింగ్‌గా మలిచారు. అది నచ్చే ఈ మూవీ చేశాను.
– `ఇస్మార్ట్ శంకర్`తో మాస్ పాత్ర చేశాను. ఇందులో మాత్రం క్లాస్ గా కనిపిస్తాను. గర్ల్ నెక్ట్స్ డోర్ అన్నమాట. ఈ పాత్రలో నటించడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు. ఎందుకంటే నేను దక్షిణాది అమ్మాయినే కాబట్టి. మన సినిమాలేఊ చూఐస్తూ పెరిగాను. థియేటర్స్ లో నటించాను. నాటకాల్లో నటించాను. కాబట్టి పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి కష్టపడలేదు. నటిగా నాకు డైరెక్టర్ చెప్పింది చేసుకుంటూ వెళతాను. సినిమా సక్సెస్ అయితే పేరొస్తుంది. కష్టపడటమే నాకు తెలుసు.