Homeగాసిప్స్సాయి తేజ్ డాక్టర్ గా మారబోతున్నాడా?

సాయి తేజ్ డాక్టర్ గా మారబోతున్నాడా?

సాయి తేజ్ డాక్టర్ గా మారబోతున్నాడా?
సాయి తేజ్ డాక్టర్ గా మారబోతున్నాడా?

యంగ్ మెగా హీరో సాయి తేజ్ గతేడాది రెండు హిట్స్ అందుకుని తిరిగి తన కెరీర్ ను ట్రాక్ లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటరు సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. శరవేగంగా సాగుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా బ్రేకులు పడింది. ఈ చిత్రంలో సాయి తేజ్ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు. లవ్ వద్దు అని ఫన్నీగా చెబుతూనే చివరికి ఎలా ప్రేమలో పడ్డాడు అన్నది కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేద్దామని ముందు భావించారు కానీ ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం వల్ల రిలీజ్ డేట్ మారే అవకాశముంది.

ఈ చిత్రం తర్వాత సాయి తేజ్ డాక్టర్ గా మారబోతున్నట్లు సమాచారం. అయితే అదేమీ కరోనా ఎఫెక్ట్ వల్ల కాదు. సినిమా కోసమే. సోలో బ్రతుకే సో బెటరు తర్వాత సాయి తేజ్ దేవా కట్టా దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ను జూన్ లో మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సాయి తేజ్ ఒక డాక్టర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సాగే సోషల్ డ్రామాగా ఈ చిత్ర జోనర్ గురించి చెబుతున్నారు. ఏలూరుకు చెందిన ఒక డాక్టర్ గా సాయి తేజ్ కనిపిస్తాడు. మెడికల్ కాలేజ్ లో చదివి అదే హాస్పిటల్ లో పనిచేసే వ్యక్తిగా ఉంటాడు. ఈ సినిమా చిత్రీకరణను ఎక్కువగా హైదరాబాద్, ఏలూరు, కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. మరి రాజకీయాలకు డాక్టర్ వృత్తికి ఎలా ముడిపెట్టాడు అన్నది ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి మరో విశేషమేమిటంటే ఇందులో రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను పోషించనుందట. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All