
సాయితేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్`. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నభా నటేష్ హీరోయిన్. జీ స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. పాండమిక్ తరువాత థియేటర్లలో విడుదలౌతున్న తొలి తెలుగు సినిమాగా ఈ మూవీ సరికొత్త రికార్డుని సృష్టించబోతోంది. ఈ సందర్భంగా ఈ మూవీలోని టైటిల్ ట్రాక్‌ని శుక్రవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో సాయితేజ్ మాట్లాడుతూ `అమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. నాలుగు పాటలు విడుదలైతే అన్నింటీకి మంచి స్పందన లభించింది. తమన్ పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపుని సొంతం చేసుకోవాలి. రఘురామ్, కాసర్ల శ్యామ్ క్యాచీ పాటలిచ్చారు. రఘురామ్ రాసిన `నో పెళ్లీ.. సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సాంగ్ కు లిరికల్ వీడియోని చేశాం. ఇందులో రానాచ వరుణ్ నటించారు. సాంగ్‌ని నితిన్ రిలీజ్ చేశాడు. ఈ ముగ్గురికీ థ్యాంక్స్. డైరెక్టర్ సుబ్బు మంచి డెడికేషన్ వున్న పర్సన్. కన్విక్షన్‌తో పనిచేశాడు. అను కథ చెప్పినప్పుడు ఎంత కసిగా చెప్పాడో అంతే కసిగా పనిచేశాడు. తనకు మంచి భవిష్యత్తు వుంటుంది. ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలా? లేక థియేటర్‌లో రిలీజ్ చేయాలా అని అనుకుంటున్నప్పుడు ముందు ఓటీటీనే అనుకున్నాం. థియేటర్స్ రీఓపెన్ అయితే థియేటర్స్‌లో రిలీజ్ చేద్దామని నిర్ణయించుకుని జీ5 వారికి చెప్పడం జరిగింది. ఇందుకు వారి నుంచి కూడా సహకారం లభిచింది` అన్నారు.
`మే 1న సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కానీ కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. సాయితేజ్‌ని అడిగితే మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండని సపోర్ట్ చేశారు. జీ 5 ఓటీటీలో సినిమాని రిలీజ్ చేయాలనుకున్నాం. అదే సమయంలో థియేటర్స్ రీఓపెన్ చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. దీంతో జీ స్టూడియోస్ సహకారంతో ఈ మూవీని ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం` అన్నారు నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో రావు రమేష్, రాజేంద్రప్రసాద్, డైరెక్టర్ సుబ్బు, జీ స్టూడియోస్ ప్రతినిధి నీరజ్ జోషీ, రఘురామ్, కాసర్ల శ్యామ్ పాల్గొన్నారు.