
మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న తాజా చిత్రం `సోలో బ్రతుకే సోబెటర్`. నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బివీఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడు నెలలుగా లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూసివేయడంతో రిలీజ్‌కు సిద్ధంగా వున్న చిత్రాల్లో చాలా వరకు ఓటీటీ బాట పట్టాయి.
ఇటీవల నాని నటించిన `వి` మూవీ, ఆ తరువాత రిలీజైన `నిశ్శబ్దం` కూడా ఓటీటీలో రిలీజైన విషయం తెలిసిందే. ఇదే బాటలో సాయధరమ్ తేజ్ నటిస్తున్న `సోలో బ్రతుకే సోబెటర్` కూడా నడవబోతోంది. ఈ చిత్రాన్ని జీప్లెక్స్‌లో త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. అయితే మిగతా సినిమాల్లా కాకుండా ఈ చిత్రాన్ని పే పర్ వ్యూ అనే విధానంలో ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.
ఇదే పద్దతిలో బాలీవుడ్ మూవీ `ఖాలీ పీలీ` విడుదలైంది. ఇక థీయేటర్లలో రిలీజైన ఈ మూవీ దారుణ ఫలితాన్ని చవిచూసింది. ఇదే పద్దతిలో విడుదల కాబోతున్న `సోలో బ్రతుకే సో బెటర్` అంతగా ఆకట్టుకుంటుందా అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. జీప్లెక్స్‌లో సబ్‌స్క్రిప్షన్ తో పాటు అమౌంట్ ని చెల్లించి సినిమా చూస్తారంటే నమ్మడం కష్టమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.