
మారుతి తెరకెక్కించిన `ప్రతి రోజు పండగే` చిత్రంతో సూపర్‌హిట్‌ని సొంతం చేసుకున్నారు సాయి ధరమ్‌తేజ్. ఈ సక్సెస్ జోష్‌లో వున్న ఆయన వరుస చిత్రాల్లో నటిస్తూ తాజాగా స్పీడు పెంచారు. యంగ్ టాలెంటెడ్ సుబ్బుని దర్శకుడిగా పరిచయం చేస్తూ బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం `సోలో బ్రతుకే సోబెటర్`. ఇస్మార్ట్ గాళ్ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.
చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని మే 2న రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. అయితే అనూహ్యంగా కరోనా వైరస్ విజృంభించడం.. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో ఇండస్ట్రీ మొత్తం బంద్ పాటిస్తోంది. షూటింగ్‌లు ఆగిపోయాయి. ఇదే క్రమంలో `సోలో బ్రతుకే సోబెటర్` షూటింగ్ కూడా వాయిదా వేశారు. ఇదిలా వుంటే సాయిధరమ్‌తేజ్ సోలో లైఫ్‌కు త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది.
ఇటీవలే 33వ పుట్టిన రోజు జరుపుకున్న సాయిధరమ్‌తేజ్ తన 34వ ఏట వివాహం చేసుకుంటానని తన మదర్‌కు మాటిచ్చారట. ఈ ఏడాది అక్టోబర్‌తో 34 ఏళ్లు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదే సాయమిధరమ్‌తేజ్ వివాహం చేసుకునే ఆలోచనలో వున్నారని తెలిసింది. సాయిధరమ్‌తేజ్ ప్రస్తుతం `సోలో బ్రతుకే సోబెటర్` చిత్రంతో పాటు దేవా కట్టా తెరకెక్కించనున్న సినిమా కూడా చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడింది.