Homeటాప్ స్టోరీస్88 ఏళ్ల నవ యవ్వనుడి సినిమా దర్శకత్వం

88 ఏళ్ల నవ యవ్వనుడి సినిమా దర్శకత్వం

88 ఏళ్ల నవ యవ్వనుడి సినిమా దర్శకత్వం
88 ఏళ్ల నవ యవ్వనుడి సినిమా దర్శకత్వం

తెలుగు సినిమా దర్శకులలో సింగీతం శ్రీనివాసరావుది చాలా ప్రత్యేకమైన శైలి. విభిన్న ఆలోచనలు చేయడంలో, కాలం కంటే ముందే ఉండి ఆలోచించడంలో సింగీతం ఎప్పుడూ ముందుండేవారు. డ్యాన్స్ ప్రధానంగా మయూరి సినిమా కానీ, సైలెంట్ సినిమా పుష్పక విమానం కానీ, టైం మెషిన్ నేపథ్యంలో నడిచే ఆదిత్య 369 కానీ, భైరవద్వీపం కానీ సింగీతం యొక్క ప్రతిభను, ఆయన ఆలోచనా పటిమను తెలియజేస్తాయి. అయితే క్రమంగా వయసు మీద పడేకొద్దీ సింగీతం సినిమాలు తగ్గించేస్తూ వచ్చారు. చివరిగా 2013లో వెల్కమ్ ఒబామా అనే సినిమాకు 80 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించారు. ఆ సినిమా రిజల్ట్ గురించి పక్కనపెడితే ఆ వయసులో సినిమాకు యాక్టివ్ గా దర్శకత్వం చేయడమంటే మాటలు కాదు. ఈ వయసులో కూడా సింగీతం చాలా ఉత్సాహంగా యువకులతో పోటీ పడుతుంటారు.

ఇటీవలే కాలంలో బాలకృష్ణ హీరోగా ఆదిత్య 369కు సీక్వెల్ తెరకెక్కించే ప్రయత్నాలు జరిగాయి. ఆదిత్య 999 పేరుతో సినిమాకు స్క్రిప్ట్ పనులు కూడా నడిచాయి. సింగీతం దర్శకుడైతే సినిమా చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని బాలయ్య చెప్పాడు కూడా. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ఈ సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. ఇక ఈ సీక్వెల్ ఆలోచన లేనట్లే అనుకోవాలి.

- Advertisement -

అయితే తాజా సమాచారం ప్రకారం సింగీతం శ్రీనివాసరావు ఇప్పుడు మరో సినిమాకు దర్శకత్వం వహించనున్నాడన్న వార్త ఖరారైంది. 88 ఏళ్ల వయసులో సింగీతం ఇప్పుడు మరో సినిమాకు డైరెక్ట్ చేయడం నిజంగా అద్భుతమే. ఒక లెజండరీ సింగర్ బయోపిక్ ను తెరకెక్కించే బాధ్యతను తీసుకున్నారు ఆయన. అది కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు నడుస్తున్నట్లు భోగట్టా. అయితే ఆ సింగర్ ఎవరు తదితర విశేషాలు అన్నీ ఇంకా తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా 88 ఏళ్ల వయసులో సింగీతం సినిమాకు దర్శకత్వం వహిస్తే అది నిజంగా ఒక రికార్డేనేమో. చూద్దాం మరి సింగీతం శ్రీనివాసరావు ఏం చేస్తారో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All