
క్రేజీ హీరోయిన్ త్రిష తమిళ హీరో శింబు గత కొంత కాలంగా ప్రేమలో వున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలో ఈ వార్తలకు తెరపడనుందని, శింబు – త్రిషల ప్రేమ కథకు కూడా ఎండ్ కార్డ్ పడనుందని తెలుస్తోంది. శింబు గత కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా వుంటూ వస్తున్నారు.
ఈ నెల 22న శింబు సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తున్నారట. ఈ విషయాన్ని ఆయన పీఆర్ టీమ్ వెల్లడించింది. ఇదే రోజు పలు ఆసక్తికరమైన విషయాల్ని శింబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించే అవకాశం వుందని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. శింబు తన పెళ్లి విషయాన్ని ప్రకటించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్రిషని శింబు పెళ్లి చేసుకోబోతున్నారని అదే విషయాన్ని త్వరలో ప్రకటించబోతున్నాడట.
త్రిషకు గత కొన్నేళ్ల క్రితం నిర్మాత వరుణ్ మణియన్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఆ తరువాత పెళ్లన్నారు.. పెళ్లి డేట్ ఫిక్స్ చేసేలోపు త్రిష అతనితో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. దీని వెనక శింబు వున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు శింబు క్లారిటీ ఇవ్వబోతున్నారట. తమ ఇద్దరిపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారని తెలిసింది.