
ప్రస్తుతం దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో పెళ్లిళ్ల హంగామా నడుస్తోంది. ఇటీవల లాక్‌డౌన్ టైమ్‌లో వరుస పెళ్లిళ్లతో టాలీవుడ్‌లో ధూమ్‌దామ్ హంగామా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కోలీవుడ్ వంతు వచ్చినట్టుగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా త్రిష పెళ్లంటూ వార్తలు జోరందుకున్నాయి. త్వరలో త్రిష, శింబు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై త్రిష కానీ శింబు కానీ స్పందించడం లేదు.
ఐదేళ్ల క్రితం త్రిష యంగ్ ప్రొడ్యూసర్ వరుణ్ మానియన్‌ని వివాహం చేసుకోవాలనుకుంది. ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. కానీ అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ వీరి ఎంగేజ్‌మెంట్ పెళ్లి దాకా వెళ్లలేకపోయింది. మధ్యలోనే ఆగిపోయింది. త్రిష్ పెళ్లి తరువాత కూడా నటిస్తానని కండీషన్ పెట్టడం వల్లే వరుణ్ మనియన్ ఈ పెళ్లిని వద్దనుకున్నాడని ప్రచారం జరిగింది.
కానీ త్రిష పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం హీరో శింబు అని చెబుతున్నారు. అతని వల్లే త్రిష తన పెళ్లిని రద్దు చేసుకుందనపి, అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో వున్నారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని శింబు తండ్రి , నటుడు, దర్శకుడు టి. రాజేందర్‌ని అడిగితే మాత్రం కస్సుబుస్సులాడుతున్నారు. శింబు పెళ్లి గురించి మీడియా ప్రశ్నిస్తే సమాధానం దాటవేస్తున్నారట. దీంతో త్రిషపై వస్తున్న వార్తలు నిజమేనని ప్రచారం మొదలైంది.