Homeటాప్ స్టోరీస్స్టార్ హీరోయిన్ అబా‌క‌స్ టీమ్‌ని చూశారా?

స్టార్ హీరోయిన్ అబా‌క‌స్ టీమ్‌ని చూశారా?

స్టార్ హీరోయిన్ అబా‌క‌స్ టీమ్‌ని చూశారా?
స్టార్ హీరోయిన్ అబా‌క‌స్ టీమ్‌ని చూశారా?

ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో స్కూల్ డేస్ మెమోరీస్‌కు ప్ర‌త్యేక స్థానం వుంటుంది. అవి జీవిత కాలం మ‌న‌ల్ని వెంటాడుతూనే వుంటాయి. చాలా వ‌ర‌కు అంద‌రికి స్కూల్ డేస్‌‌ తీపి జ్ఞాప‌కాల్నే అందిస్తుంది. అవి మ‌ధుర జ్ఞాప‌కాలుగా మిగిలిపోతాయి. ఇదే ద‌శ‌లో జీవిత కాలం గుర్తండే స్నేహ బంధాల్ని కూడా ఏర్ప‌రుస్తుంది. ఇలాంటి జ్ఞాప‌కాలే స్టార్ హీరోయిన్ శృతిహాస‌న్‌కీ వున్నాయ‌ట‌. ‌

స్టార్ హీరోయిన్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న శృతిహాస‌న్ త‌న స్కూల్ డేస్ మ‌ధుర జ్ఞాన‌ప‌కాల్ని నెటిజ‌న్స్‌తో పంచుకుంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న స్కూల్ డేస్ ఫొటోని షేర్ చేసింది. ఖాకీ క‌ల‌ర్‌ హాఫ్ స్క‌ర్ట్.. ఆపై లైట్ రెడ్ లైన్స్ వున్న స్కూల్ డ్రెస్‌లో త‌న స్నేహితుల‌తో క‌లిసి ఫొటోల‌కు పోజులిచ్చిన ఫొటోని అభిమానుల‌తో పంచుకుంది.

- Advertisement -

అబాక‌స్ క్లాస్‌మేట్స్‌తో త‌న అనుభూతుల్ని పంచుకుంది. అబాక‌స్ మెమోరీస్ అంటూ ఫొటోకి క్యాప్ష‌న్ ఇచ్చింది. అనుశ‌ర్మ‌, అన్షు అండ్ శ‌క్తి వంటి అద్భుత‌మై స్నేహితుల్ని అబాక‌స్ స్కూల్ త‌న‌కు అందించింద‌ని, ఈ సంద‌ర్భంగా స‌ద‌రు స్కూల్‌కి కృత‌జ్ఞ‌త‌ల‌ని పేర్కొంది. శృతిహాస‌న్ న‌టిస్తున్న తెలుగు చిత్రం క్రాక్‌`. ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తున్న ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ బుధ‌వారం మొద‌లైంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All