
కొన్ని తెలుగు పబ్లికేషన్స్ తన మాటల్ని వక్రికరించాయని చెబుతోంది స్టార్ హీరోయిన్ శృతిహాసన్. తాజాగా సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటూ వచ్చిన శృతిహాసన్ తమిళ చిత్రం `లాభం`తో మళ్లీ నటించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న `క్రాక్` చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో వుంది.
ఇదిలా వుండగా ఇటీవల ఓ జాతీయ మీడియాకు శృతిహాసన్ ఇంటర్వ్యూ ఇచ్చింది. పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించిన శృతి కెరీర్ తొలి నాళ్లలో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించానరని అయితే తాను నటించే సమయంలో అవి తనకు పెద్దగా గొప్పగా అనిపించలేదని. ఇక నుంచి మంచి చిత్రాల్ని ఎంచుకుంటాను`అని పేర్కొందట. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది.
కొన్ని తెలుగు పబ్లికేషన్స్ సంస్థలు తను జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఓ అంశాన్ని తీసుకుని వక్రీకరిస్తూ అసత్య కథనాలు ప్రచురించాయని దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానని తెలిపింది. రేసు గుర్రం, గబ్బర్‌సింగ్ వంటి చిత్రాల్లో తాను భాగమైనందుకు గర్వంగా వుందన్నారు. పవన్‌కల్యాణ్‌గారితో కలిసి నటించిన `గబ్బర్‌సింగ్` తన కెరీర్‌ని, జీవితాన్ని మార్చిందని వెల్లడించింది.