Homeటాప్ స్టోరీస్మరోసారి లవ్ స్టోరీ రాస్తోన్న శివ నిర్వాణ

మరోసారి లవ్ స్టోరీ రాస్తోన్న శివ నిర్వాణ

మరోసారి లవ్ స్టోరీ రాస్తోన్న శివ నిర్వాణ
మరోసారి లవ్ స్టోరీ రాస్తోన్న శివ నిర్వాణ

యువ దర్శకుడు శివ నిర్వాణ తన లేటెస్ట్ సినిమా టక్ జగదీష్ తో సరైన ఫలితాన్ని అందుకోలేదు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ  చిత్రం అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ విడుదలైంది. ఈ చిత్రం వ్యూస్ పరంగా రికార్డ్ సృష్టించినా కానీ టాక్ అయితే నెగటివ్ గానే ఉంది. మరీ మూస కథతో శివ నిర్వాణ సినిమాను రూపొందించాడని అన్నారు. అయితే ఈ విమర్శల నుండి శివ త్వరగానే బయట పడినట్లున్నాడు.

తన నాలుగో సినిమాకు రైటింగ్ మొదలుపెట్టేశాడు. “అందరికీ హాయ్. వైజాగ్ బీచ్ లో ఉన్నా. నాకు వైజాగ్ లొకాలిటీ అన్నా బీచ్ అన్నా కూడా ఎంతో ఇష్టం. మీలో కూడా కొంతమందికి తెలుసనుకుంటున్నా. నా నిన్ను కోరి, మజిలీ సినిమాలను మీరందరూ మనసులలోకి తీసుకున్నారు. ఇప్పుడు మరో ప్రేమ కథ రాస్తున్నా. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది, హ్యాపీగా ఉంది. సముద్రం, కెరటాలు ఎంత ఒరిజినల్ గా ఉంటాయో ఈ కథ అంత ఒరిజినల్ గా ఉంటుంది” శివ నిర్వాణ వీడియో బైట్ పోస్ట్ చేసాడు.

- Advertisement -

శివ నిర్వాణకు విజయ్ దేవరకొండతో కమిట్మెంట్ ఉంది. మరి ఈ కథ తనకోసమేనా అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All