
విజయ్ దేవరకొండ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చాడు. నేడు విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్యాన్ ఇండియా అప్పీల్ ఉన్న హీరో. ప్రస్తుతం లైగర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రం మొత్తం ఐదు భాషల్లో విడుదలవుతుంది.
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తన సొంత మల్టీప్లెక్స్ ను ప్రారంభిస్తున్నాడు. ఏషియన్ సినిమాస్ పార్ట్నర్ షిప్ తో విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో మల్టీప్లెక్స్ ను సెటప్ చేసాడు. సెప్టెంబర్ 24న ఈ మల్టీప్లెక్స్ మొదలుకాబోతోంది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ సినిమాల్లోకి రావడానికి ఎన్నో కలలు కన్నాను. చాలా కష్టపడ్డాను.
ఈరోజు నా సొంత మల్టీప్లెక్స్ ప్రారంభం అవుతోంది, చాలా ఆనందంగా ఉంది. నా తల్లిదండ్రుల సొంత ఊరైన మహబూబ్ నగర్ లో ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభించాలని అనుకున్నా. సెప్టెంబర్ 24న లవ్ స్టోరీ చిత్రంతో ఈ మల్టీప్లెక్స్ మొదలవుతుంది. నేను కూడా ఓపెనింగ్ కు వద్దామనుకున్నా కానీ గోవాలో లైగర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాను.
From dreaming of becoming an Actor to now owning my own Multiplex Cinema ?
I share with you all,
Asian Vijay Deverakonda cinemas ?The 1st AVD will officially open in Mahbubnagar, from September 24th 2021. https://t.co/rv5l22B16U
— Vijay Deverakonda (@TheDeverakonda) September 19, 2021
