Homeటాప్ స్టోరీస్తన మీద వచ్చిన ట్రోల్స్ కు రెస్పాండ్ అయిన శివ నిర్వాణ

తన మీద వచ్చిన ట్రోల్స్ కు రెస్పాండ్ అయిన శివ నిర్వాణ

shiva nirwana reacts to the trolls on tuck jagadish

యువ దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన టక్ జగదీష్ సెప్టెంబర్ 9న రాత్రి నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. న్యాచురల్ స్టార్ నాని ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి మిక్స్డ్ రేటింగ్స్ వచ్చాయి.

- Advertisement -

క్రిటిక్స్ యావరేజ్ టు ఎబోవ్ యావరేజ్ రేటింగ్స్ ఇచ్చినా కానీ సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్స్ బాగా వచ్చాయి. ముఖ్యంగా దర్శకుడు శివ నిర్వాణ ఎక్కువగా ఫ్యామిలీ సెంటిమెంట్ ను పెట్టాడన్న కారణంతో ట్రోల్ చేసారు. దీనిపై దర్శకుడు రియాక్ట్ అయ్యాడు. “ఈ చిత్రం విడుదలైనప్పుడు అందరూ మాట్లాడుకుంటారు. మంచి, చెడు, పాజిటివ్, నెగటివ్ ఇలా అన్నీ. అన్నిటినీ నిజాయితీతో, చిరునవ్వుతో స్వీకరించాలి, దానికి నేను సిద్ధం, అందరికీ థాంక్స్” అని శివ నిర్వాణ ట్వీట్ చేసాడు.

శివ నిర్వాణ గత రెండు చిత్రాలు నిన్ను కోరి, మజిలీ సూపర్ హిట్స్ గా నిలిచిన విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All