Homeటాప్ స్టోరీస్శ‌ర్వానంద్ లుక్ టెర్రిఫిక్‌గా వుందిగా!

శ‌ర్వానంద్ లుక్ టెర్రిఫిక్‌గా వుందిగా!

శ‌ర్వానంద్ లుక్ టెర్రిఫిక్‌గా వుందిగా!
శ‌ర్వానంద్ లుక్ టెర్రిఫిక్‌గా వుందిగా!

కొత్త త‌ర‌హా చిత్రాల్లో న‌టిస్తూ హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు హీరో శ‌ర్వానంద్. ఆయ‌న పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న `మ‌హాస‌ముద్రం` చిత్రానికి సంబంధించి ఫ‌స్ట్ లుక్ ని చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది. శ‌ర్వానంద్, `బొమ్మ‌రిల్లు` సిద్ధార్ధ్‌తో క‌లిసి న‌టిస్తున్నారు. `Rx100` అజ‌య్ భూప‌తి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంకర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితీరావు హైద‌రీ, అను ఇమ్మానుయేల్ హీరోయిన్‌లు. యాన్ ఇమ్మాజ‌ర‌బుల్‌(అపురూప‌మైన ప్రేమ‌) అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్‌. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర థీమ్ పోస్ట‌ర్స్ సినిమాని ఓ అంద‌మైన ప్రేమ కావ్యంగా ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి తీర్చి దిద్దుతున్న‌ట్టుగా తెలుస్తోంది. తాజాగా శ‌ర్వా పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది.

- Advertisement -

ప‌డ‌వ ఫ్యాన్ రాడ్‌ని చేత ప‌ట్టుకుని ప్ర‌త్య‌ర్థుల భ‌ర‌తం ప‌డుతున్న శ‌ర్వా లుక్ టెర్రిఫిక్‌గా వుంది. స‌రికొత్త నేప‌థ్యంలో యాక్ష‌న్ అంశాల్ని జోడించి ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రాన్ని అజ‌య్ భూప‌తి తెర‌కెక్కిస్తున్నారు. రొమాంటిక్ యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 19న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All