
యంగ్ హీరో శర్వానంద్ తన కొత్త చిత్ర షూటింగ్‌ని పునః ప్రారంభించేశారు. గత ఏడు నెలలుగా షూటింగ్‌లకు దూరంగా వున్న ఆయన తన కొత్త చిత్రాన్ని బుధవారం మొదలుపెట్టారు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా వరుసగా షూటింగ్‌లు పునః ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శర్వానంద్ నటిస్తున్న ద్విభాషా చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీకార్టీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లాక్‌డౌన్ బిఫోర్ కీలక షెడ్యూల్స్ ముగించుకున్న ఈ చిత్ర బృందం గత ఏడు నెలలుగా ఎప్పుడు ప్రభుత్వం అనుమతులిస్తుందా? పరిస్థిల్లో మార్పులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూసింది. ఎట్టకేలకు బుధవారం షూటింగ్‌ని పునః ప్రారంభించింది. చివరి షెడ్యూల్‌ని చెన్నైలో పూర్తి చేస్తున్నారు.
`పెళ్లి చూపులు` ఫేమ్ రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్` తరువాత అక్కినేని అమల నటిస్తున్న చిత్రమిది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్. ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.