
టాలీవుడ్‌లో కరోనా సమయంలో వరుస పెళ్లిళ్ల హంగామా నడుస్తోంది. యంగ్ హీరోలు, దర్శకులు వరుసగా పెళ్లి బాట పడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వరుసగా పెళ్లికి రెడీ అవుతున్నారు. దిల్ రాజు రెండో పెళ్లి నుంచి టాలీవుడ్ లో వెడ్డింగ్ ల సందడి ఊపందుకుంది. నిఖిల్, నితిన్, రానా, దర్శకుడు సుజిత్ ఇప్పటికే ఓ ఇంటి వారయ్యారు. త్వరలో మెగా డాటర్ కొణిదెల నిహారిక వివాహం జరగనున్న విషయం తెలిసిందే.
తాజాగా యంగ్ హీరో శర్వానంద్ కూడా వీరి బాటలోనే తన బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పబోతున్నాడు. మెగా హీరో రామ్‌చరణ్ తరహాలోనే తన చిన్ననాటి స్నేహితురాలిని శర్వా పెళ్లాడబోతున్నారట. గత కొంత కాలంగా ప్రేమలో వున్న వీరు తమ ప్రేమని తమ పెద్దలకు వివరించారట. వెంటనే అంగీకరించిన ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. త్వరలోనే ఎంగేజ్‌మెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
శర్వానంద్ ప్రస్తుతం `శ్రీకారం` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీతో పాటు అజయ్ భూపతి `మహా సముద్రం`, యువీలో ఓ మూవీ, ఏషియన్ ఫిలింస్‌లో మరో మూవీ చేయబోతున్నారు. పెళ్లి వార్తల్లో వున్న నిజమెంతో తెలియాలంటే స్వయంగా శర్వానంద్ ప్రకటించేంత వరకు వేచి చూడాల్సిందే.