
షారుక్‌ఖాన్.. ఒకప్పుడు బాలీవుడ్ బాద్ షా. ఆయన ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద ఒకప్పుడు కాసుల వర్షం కురిసేది. జనం తండోపతండాలుగా థియేటర్లలో సందడి చేసేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఆయన ఏ సినిమా చేసినా బాక్సాఫీస్‌వద్ద భారీ నష్టాలని చవి చూడటమే కాకుండా దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో మరో సినిమా చేయడానికి షారుక్ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గత కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్నారు.
షారుక్ మళ్లీ సినిమా చేయాలని, అది థియేటర్లలో సందడి చేయాలని ఆయన అభిమానులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన ఇప్పటికీ తన కొత్త చిత్రాన్ని ప్రకటించడం లేదు. ఈ నేపథ్యంలో తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్‌తో కలిసి షారుక్ ఓ భారీ చిత్రం చేయబోతున్నారంటూ వరుస కథనాలు వినిపిస్తున్నాయి. వీటిపై ఇంత వరకు అటు అట్లీ కానీ, ఇటు షారుక్ కానీ స్పందించలేదు. ఇక షారుక్ సినిమా చేయడా? అని ఆలోచిస్తున్న ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ రాబోతోంది.
అట్లీ కుమార్ దర్శకత్వంలో షారుక్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్ రెడీ మొదలైందని తెలిసింది. ఇందులో షారుక్ రా ఏజెంట్‌గా కనిపిస్తారని టాక్. పలు దేశాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. ఇందు కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయబోతున్నారని, ఈ చిత్రాన్ని షారుక్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనుందని టాక్.