Homeటాప్ స్టోరీస్“షారుఖ్ మై ఫేవరేట్..!” అంటున్న ఆ మెగా హీరో

“షారుఖ్ మై ఫేవరేట్..!” అంటున్న ఆ మెగా హీరో

“షారుఖ్ మై ఫేవరేట్..!” అంటున్న ఆ మెగా హీరో
“షారుఖ్ మై ఫేవరేట్..!” అంటున్న ఆ మెగా హీరో

సినిమా ఇండస్ట్రీ లో నటులకు కూడా వాళ్ళ ఫేవరేట్ ఆర్టిస్ట్ లు ఉంటారు. వాళ్ళు సినిమాలకు రావడానికి ఇన్స్పిరేషన్ అని, కొంతమంది తారలు ఇప్పటికీ వాళ్ళ అభిమాన హీరోల కథలను, హావభావాలను, అనుసరించడం చూస్తూనే ఉన్నాం. ఒకరకంగా ఇప్పుడు వచ్చే ప్రతి కొత్త నటులలో హీరో కావాలనుకునే వాళ్ళకు పవన్ కళ్యాన్ ప్రభావం ఉంటుంది. అది వాళ్ళు ఇమిటేషన్ చెయ్యకపోయినా, కొంతవరకూ ఆటిట్యూడ్ లో తెలిసిపోతుంది. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు అందరికీ చిరంజీవి గారు దైవ సమానుల వంటి వారే అయినా, నటనలో, స్టైల్ లో అందరూ పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతారు. ఇక నితిన్ వంటి కొంతమంది పవర్ స్టార్ వీరాభిమానులు అయితే సినిమాలలో కృతజ్ఞత పూర్వకంగా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు వాడుకుంటారు.

మెగా బ్రదర్ నాగబాబు గారి తనయుడైన వరుణ్ తేజ్ గత ఏడాది గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి వాల్మీకీ అలియాస్ గద్దలకొండ గణేష్ అనే సోపర్ హిట్ ఇచ్చారు. ఒరిజినల్ తమిళ్ మూవీ “జిగార్తండ” లా కాకుండా ఒక డిఫరెంట్ థీం లో ఈ సినిమా ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యింది. తాజాగా వరుణ్ తేజ్ తన తరువాతి సినిమాను కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో చేస్తున్నారు. ఈ సినిమాకు “బాక్సర్” అనే టైటిల్ ఫైనల్ చేసారు. వరుణ్ ప్రస్తుతం ముంబై లో ఫిట్ నెస్ & బాక్సింగ్ ట్రైనర్స్ అయిన రాకేశ్ ఉడయార్, నీరజ్ గోయర్ ల ఆధ్వర్యంలో ఇంటెన్స్ కోచింగ్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తనకు బాలీవుడ్ బాద్ షారుఖ్ అంటే ఎంతో అభిమానం అని తెలిపారు. ఇప్పటికే పలు బాలీవుడ్ మేకర్స్ తనను సంప్రదించారని, కానీ సరైన స్క్రిప్ట్ కుదరక తను ఆగానని వివరించారు వరుణ్ తేజ్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All