Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ అట్లీ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?

ఎన్టీఆర్ అట్లీ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?

ఎన్టీఆర్ అట్లీ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?
ఎన్టీఆర్ అట్లీ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?

ఈ మధ్య విజయ్ విజిల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హైదరాబాద్ వచ్చిన స్టార్ డైరెక్టర్ అట్లీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనతో టచ్ లో ఉంటాడని, ఏ ఇనెమ విడుదలైనా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతాడని చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంగా మాట్లాడుతూ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని కూడా అన్నాడు. ఇద్దరి మధ్య ఈ విషయంపై చర్చ జరిగినట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఖుషీ అయిపోయారు. అట్లీ తమిళ దర్శకుడే అయినా తెలుగు వారికి పరిచయమున్నవాడే. తన ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ అయింది. విజయవంతమయ్యాయి కూడా. అట్లీ సినిమాలంటే హీరోయిజాన్ని ఓ లెవెల్లో లేపుతాడన్న విషయం తెల్సిందే. అందుకే ఎన్టీఆర్ తో సినిమా అంటే ఫ్యాన్స్ ఒక ఊపున్న మాస్ మసాలా సినిమా ఊహించుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాతే ఈ సినిమా ఉంటుందన్న చర్చలు కూడా జరిగిపోయాయి ఫ్యాన్స్ మధ్య. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పట్లో ఎన్టీఆర్ – అట్లీ కాంబినేషన్ ఉండదనే అంటున్నారు. దానికి కారణాలు కూడా లేకపోలేదు.

అట్లీ ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో సినిమా తీయబోతున్నాడు. గత ఏడాది నుండి అట్లీ – షారుఖ్ సినిమా గురించి చర్చలు నడుస్తున్నాయి. ఇటీవలే షారుఖ్ ఖాన్ పుట్టినరోజుకి అట్లీ తన భార్యతో కలిసి వెళ్లి పార్టీ అటెండ్ అయ్యాడు కూడా. ఆ మధ్య షారుఖ్ తో సినిమా అంటే తప్పకుండా ఉంటుందన్న తరహాలోనే మాట్లాడాడు అట్లీ. ఇప్పుడు బాలీవుడ్ లో వినిపిస్తున్న రూమర్స్ బట్టి షారుఖ్ వద్ద అట్లీ మూడు సినిమాలకు సైన్ చేసాడట. ఇందులో మొదటగా షారుఖ్ హీరోగా ఒక సినిమాను అట్లీ డైరెక్ట్ చేస్తాడు. తర్వాత షారుఖ్ నిర్మాతగా మరో బాలీవుడ్ హీరోతో అట్లీ సినిమా ఉంటుంది. ఇంకా మూడో సినిమా గురించి ఎటువంటి సమాచారం లేదు. సో, అట్లీ మూడు సినిమాలు చేసేవరకూ బాలీవుడ్ కే పరిమితమవుతాడు. తన సొంత భాష అయిన తమిళంలోనే ఒక నాలుగేళ్ల పాటు అట్లీ సినిమా చేయలేడు. ఇక తెలుగు గురించి చెప్పేదేముంది. సో, ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని అన్నీ, అది ఇప్పట్లో కాదని, తర్వాత పరిస్థితులు మారి అసలు ఉంటుందో లేదో కూడా చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

ఇక మరోవైపు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ తర్వాత కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎవరి సినిమా ముందు, ఎవరిది తర్వాత అన్న విషయంలో క్లారిటీ లేదు కానీ ఈ ఇద్దరి దర్శకులతో ఎన్టీఆర్ తర్వాతి సినిమాలు ఉంటాయి. మరోవైపు త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీతో అల వైకుంఠపురములో తెరకెక్కిస్తున్నాడు. త్రివిక్రమ్ కు రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా కమిట్మెంట్ ఉంది. కొరటాల శివ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. కొరటాల శివకు కూడా రామ్ చరణ్ తోనే ఎప్పటినుండో ఒక సినిమా కమిట్మెంట్ ఉంది. మరి ఎవరి చిత్రం ఎవరితో ఎప్పుడు మొదలవుతుందో ఆర్ ఆర్ ఆర్ పూర్తయితే కానీ క్లారిటీ రాదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All