Homeటాప్ స్టోరీస్శాకుంతలం అప్పుడే సగం అయిందట

శాకుంతలం అప్పుడే సగం అయిందట

శాకుంతలం అప్పుడే సగం అయిందట
శాకుంతలం అప్పుడే సగం అయిందట

భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ గురించి పరిచయం అవసరం లేదు. ఒక ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోకుండా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు గుణశేఖర్. రుద్రమదేవి తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు రెండు మైథలాజికల్ ప్రాజెక్టులను సెట్ చేసుకున్నాడు. అందులో ఒకటి రానా దగ్గుబాటి హీరోగా హిరణ్యకశ్యప  కాగా మరొకటి సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం.

మహాభారతంలోని ఆది పర్వంలో నుండి శకుంతల ప్రేమకథను స్ఫూర్తిగా తీసుకుని ఈ స్క్రిప్ట్ ను  సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ ను సైతం కేటాయించాడు. మలయాళ నటుడు దేవ్ మోహన్ సమంతకు జోడిగా నటిస్తున్నాడు. మార్చ్ లో ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా జెట్ స్పీడ్ లో షూటింగ్ సాగినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అప్పుడే 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసినట్లు దర్శకుడు గుణశేఖర్ వివరించాడు. మే 12 దాకా షూటింగ్ కొనసాగించినట్లు తెలిపాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయని, ప్రస్తుతం 1 గంట వరకూ షూటింగ్ చేసుకునే వెసులుబాటు ఉన్న కారణంగా త్వరలోనే షూటింగ్ ను తిరిగి మొదలుపెడతామని గుణశేఖర్ అంటున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All