Monday, October 3, 2022
Homeగాసిప్స్శాకుంతలం కూడా ప్యాన్ ఇండియా వైపే?

శాకుంతలం కూడా ప్యాన్ ఇండియా వైపే?

శాకుంతలం కూడా ప్యాన్ ఇండియా వైపే?
శాకుంతలం కూడా ప్యాన్ ఇండియా వైపే?

భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన గుణశేఖర్ తన నెక్స్ట్ చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. మహాభారతంలో ఆది పర్వంలో అభిజ్ఞాన శాకుంతలం కథావస్తువుగా ఈ సినిమా తెరకెక్కనుంది. సమంత శకుంతలగా నటించనుండగా దేవ్ మీనన్ దుశ్యంత మహారాజు పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు నటి ఈషా రెబ్బ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రను పోషించనుంది.

- Advertisement -

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ప్యాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయాలని గుణశేఖర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో తెలుగు నుండి ప్యాన్ ఇండియా సినిమాలు వస్తుండగా దానికి శాకుంతలం  జత కానుంది.

గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణా ఈ చిత్రాన్ని నిర్మించనుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శాకుంతలం చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలో రానుంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts