Homeటాప్ స్టోరీస్వరస పీరియాడిక్ డ్రామాస్ తో గుణశేఖర్

వరస పీరియాడిక్ డ్రామాస్ తో గుణశేఖర్

వరస పీరియాడిక్ డ్రామాస్ తో గుణశేఖర్
వరస పీరియాడిక్ డ్రామాస్ తో గుణశేఖర్

భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు గుణశేఖర్. భారీ వ్యయప్రయాసలకోర్చి తీసిన రుద్రమదేవి డీసెంట్ హిట్ అనిపించుకుంది. దాని తర్వాత భారీ గ్యాప్ తీసుకుని హిరణ్యకశ్యప స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడు గుణశేఖర్. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కించడానికి ప్రణాళికలు వేసుకున్నాడు. సినిమాను అనౌన్స్ చేసారు కూడా. అయితే ఈలోగా పాండెమిక్ కారణంగా ఈ భారీ చిత్రం వాయిదా పడింది.

అయితే ఈలోగా గుణశేఖర్ సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ మొదలై కొన్ని రోజుల పాటు సాగింది. ఈలోగా కరోనా ప్రభావం కారణంగా శాకుంతలం షూటింగ్ వాయిదా పడింది. ఇక లాక్ డౌన్ సమయంలో గుణశేఖర్ మరో పీరియాడిక్ డ్రామాతో మన ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఈ లాక్ డౌన్ సమయంలో ప్రతాపరుద్ర స్క్రిప్ట్ ను సిద్ధం చేసాడు గుణశేఖర్. కాకతీయ సామ్రాజ్య ఆఖరి చక్రవర్తిగా ప్రతాపరుద్రను చరిత్ర గుర్తించుకుంది. రుద్రమదేవి వారసుడు ఈయన. ఒక టాప్ హీరోకు ప్రతాపరుద్ర కథ చెప్పాలని గుణశేఖర్ భావిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All