
షకీలా.. కేరళ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన పేరిది. ఆమె సినిమా వస్తోందంటే స్టార్ హీరోలైన మమ్ముట్టి, మోహన్‌లాల్ ల సినిమాలు వాయిదా వేసుకోవాల్సిందే. అలా చాలా సందర్భాల్లో జరిగిందంట. ఇక లాభం లేదనుకున్న మలయాళ స్టార్స్ మోహన్‌లాల్, మమ్ముట్టితో పాటు మలయాళ హీరోలు చాలా వరకు షకీలా చిత్రాలని కేరళలో బ్యాన్ చేయాలనుకున్నారట. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన టాక్ షోలో షకీలా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.
కేరళ స్టార్స్ చిత్రాలు 4 కోట్లతో చేస్తుంటే షకీలా సినిమాలు కేవలం 20 లక్షల్లో నిర్మించేవారట. దీంతో తక్కువ బడ్జెట్‌తో సినిమాలు చేయడం వల్ల షకీలా చిత్రాలు వారానికి ఒక చిత్రం రిలీజ్ అయ్యేవట. ఈ పోటీ వల్ల మమ్ముట్టి, మోహన్‌లాల్ నటించిన చిత్రాలు భారీగా నష్టపోయేవట. దీని కారణంగానే షకీలా సినిమాలని బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నారట.
షకీలాపై స్టార్స్ అంతా గుర్రుగా వుంటే షకీలాని మాత్రం 20 మంది ప్రేమించారట. అయితే వారిలో తనని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదని, ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నారని, కొన్నాళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని, ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నామని, అయితే వాళ్ల ఇంట్లో వాళ్లు అందుకు ఒప్పుకోలేదని షకీలా వెల్లడించింది.