Homeటాప్ స్టోరీస్మ‌ల‌యాళ హీరోతో శ‌ర్వా డైరెక్ట‌ర్‌!

మ‌ల‌యాళ హీరోతో శ‌ర్వా డైరెక్ట‌ర్‌!

మ‌ల‌యాళ హీరోతో శ‌ర్వా డైరెక్ట‌ర్‌!
మ‌ల‌యాళ హీరోతో శ‌ర్వా డైరెక్ట‌ర్‌!

మ‌ల‌యాళ హీరో మ‌మ్ముట్టి త‌న‌యుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ వున్న విష‌యం తెలిసిందే. మ‌ణిర‌త్నం బౌన్స్ బ్యాక్ అయిన చిత్రం `ఓకే బంగారం`తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు దుల్క‌ర్ ప‌రిచ‌యం అయినా `మ‌హాన‌టి` చిత్రంతో మ‌రింత చేరువ‌య్యారు. ఈ రెండు చిత్రాల త‌రువాత దుల్క‌ర్ న‌టించిన చిత్రాలు తెలుగులో డ‌బ్బింగ్ అవుతూనే వున్నాయి. తాజాగా త‌మిళంలో న‌టించిన `క‌న్నుమ్ కన్నుమ్ కొల్ల‌యాడిత‌ల్‌` చిత్రాన్ని తెలుగులో కేఎఫ్‌సీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ `క‌నులు క‌నుల‌ను దోచాయంటే` పేరుతో రిలీజ్ చేసింది.

ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం తెలుగులో మంచి విజ‌యాన్ని సాధించింది. ఓ టెక్కీ, ఫ్రీలాన్స‌ర్ మ‌ధ్య సాగే రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. క‌థ‌, క‌థ‌నాలు కొత్త‌గా వుండ‌టం, తొలిసారి ఈ చిత్రంలో ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ విల‌న్‌గా న‌టించ‌డం వంటి ప్ర‌త్యేక‌త‌ల‌తో వ‌చ్చిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఓ తెలుగు ద‌ర్శ‌కుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌తో ఓ ల‌వ్‌స్టోరీని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -

ఇటీవ‌ల శ‌ర్వానంద్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` చిత్రాన్ని తెర‌కెక్కించిన హ‌ను రాఘ‌వ‌పూడి హీరో దుల్క‌ర్‌తో సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇటీవ‌లే దుల్క‌ర్ క‌థ విన్నాడ‌ని, స్టోరీ న‌చ్చ‌డంతో ఓకే చేశాడ‌ని తెలిసింది. దీనికి సంబంధించిన అఫీష‌య‌ల్ అనౌన్స్‌మెంట్ త్వ‌ర‌లోనే రానున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All