
మా అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ ఎన్నికలకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయి. అక్టోబర్ 10న మా ఎలెక్షన్స్ జరగనున్న నేపథ్యంలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ మధ్య ప్రధానంగా పోటీ ఉండబోతోంది. బండ్ల గణేష్ జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ వేయగా నిన్న తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇక సీనియర్ నటుడు సీవీఎల్ కూడా ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నట్లు ప్రకటించాడు.
నామినేషన్ కూడా వేసాడు. ఈరోజు ఉదయం మ్యానిఫెస్టో విడుదల చేసాడు. మా అసోసియేషన్ సభ్యులు అందరికీ అవకాశాలు కల్పిస్తానని అన్నాడు. పేద కళాకారులకు చేయాల్సిందానిపై చర్చ కూడా పెట్టాడు. సీవీఎల్ మ్యానిఫెస్టోను కొందరు పొగిడారు కూడా. అందరికీ అవకాశాలు ఉన్నాయని అన్నారు.
మరి ఏమైందో ఏమో తెలీదు కానీ సడెన్ గా తన నామినేషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు సివిఎల్. దీని వెనుక కారణం ఉందని, అయితే ఎందుకన్నది త్వరలోనే చెబుతానని అన్నాడు. ప్రస్తుతం పోటీలో ఉన్న రెండు ప్యానెల్స్ లో తాను ఎవరికీ సపోర్ట్ చేయడం లేదని, ఎవరు అధికారంలోకి వచ్చినా ఆర్టిస్ట్ లకు మంచి జరిగితే చాలని అభిప్రాయపడ్డాడు.