Homeటాప్ స్టోరీస్మా స్టార్ మ్యాగజైన్ పేరుతో ఎన్నారై ని మోసం చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

మా స్టార్ మ్యాగజైన్ పేరుతో ఎన్నారై ని మోసం చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

Huge loss to NRI murali by MAA for MAA STARS Magazineపేద ఆర్టిస్ట్ సహాయార్ధం యాక్టర్స్ వాడిన వస్తువులను వేలం వేసి దాని ద్వారా వచ్చిన నగదు ని పేద ఆర్టిస్ట్ కి పంచుతాము అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా స్టార్స్ ‘ అనే వెబ్ సైట్  స్టార్ట్ చేసింది. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ చిత్రంలోని ఎన్టీఆర్ ధరించిన  జాకెట్ ని  ఆక్షన్ కి పెట్టింది.

దానికి  మురళి అనే ఒక ఎన్నారై Rs 50,000/- బిడ్ వేసాడు . అయితే  వేరే జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ పది లక్షలకు ఆ జాకెట్ ని సొంతం చేసుకోవడానికి ఆక్షన్ లో పాల్గొన్నారు . .. కానీ ఎవరు డబ్బు ఇవ్వలేదు . చివరకు మురళి కి ఎన్నో తాయత్తులు ఇచ్చి (తాయత్తులు జూనియర్ ఎన్టీఆర్ మ్యారేజ్ కి ఆహ్వానం , జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్  వెబ్ సైట్  jrntr.com చేస్తాము, నీకు ఇండస్ట్రీలో పరిచయాలు చేయిస్తాము , జూనియర్ ఎన్టీఆర్ జాకెట్ Rs 50,000/-  మాత్రమే అంటే  జూనియర్ ఎన్టీఆర్ పరువు పోతుంది ) అని ‘మా స్టార్స్ ‘  వెబ్ సైట్  ఇంచార్జి  శేఖర సుంకర కల్లబొల్లి కబుర్లు చెప్పి మురళి దగ్గర Rs 10 లక్షలు తీసుకొన్నారు.

- Advertisement -

Huge loss to NRI murali by MAA for MAA STARS Magazine

జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ జాకెట్ Rs 10 లక్షలకు  కొన్నాడు అంటే మురళి దగ్గర చాల డబ్బులు వున్నాయి . మురళితో మా స్టార్ మ్యాగజైన్ పెట్టిస్తే మనకు మంచి ప్రచారం మరియు డబ్బులు వస్తాయి అని మురళి తో కల్లబొల్లి కబుర్లు చెప్పి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ “మా స్టార్స్ ” అనే మ్యాగజైన్ స్టార్ట్ చేయించారు . మురళి ని మా స్టార్స్ మ్యాగజైన్ C.E.O గా అపాయింట్  చేసారు.

మూడు నెలలు మా స్టార్స్ మ్యాగజైన్ లో కంటెంట్ సరిగ్గా లేక 100% లాసుల్లో నడిచింది (నెలకు 10 లక్షలు లాస్). నాలుగో నెలలో మురళి కంటెంట్ మార్చమని సలహా ఇచ్చాడు ఎందుకంటే నెలకు 10 లక్షలు లాస్ వస్తుంది అని. దానికి ఆగ్రహించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మురళి పేరుని C.E.O గా తొలగించి ప్రింటర్ గా   వేశారు. ఇంతకీ మురళికి తెలియదు తనని C.E.O గా తొలగించి ప్రింటర్ గా వేశారు అని. C.E.O గా తొలగించి ప్రింటర్ గా వేశారని చూసి ఆగ్రహించిన మురళి మా స్టార్స్ మ్యాగజైన్ మీద ఇన్వెస్ట్ చెయ్యను అని చెప్పాడు.

 

డబ్బులు పెట్టె మురళి ని C.E.O గా ప్రకటించడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిరాకరించడంతో మురళి ఇన్వెస్ట్ చెయ్యడం ఆపేసాడు దాని వల్ల  “మా స్టార్స్ ”  మ్యాగజైన్ మూతపడింది.

 

దీని వల్ల మురళి అనే వాడు అక్షరాల Rs 60 లక్షలు in 5 Months  లో పోగొట్టుకొన్నాడు.

 

కొసమెరుపు : మురళికి జూనియర్ ఎన్టీఆర్ మ్యారేజ్ కి ఆహ్వానం రాలేదు  , జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్ వెబ్ సైట్ గా   jrntr.com చెయ్యలేదు పైగా మురళి స్టార్ట్ చేసిన facebook.com/jrntr & facebook.com/ntrjr కూడా లాగేసుకున్నారు.

 

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయినందుకు  మురళి ఎంతో నష్టపోయాడు .

జరుగుతున్న అన్యాయాన్ని జూనియర్ ఎన్టీఆర్ కు చెబుదామని మురళి కాంటాక్ట్  చేసినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ వైపు నుండి మాత్రం స్పందన లేకుండాపోయింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All